BSNL 4G: డిసెంబర్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు.. అప్పటికల్లా దేశవ్యాప్తం!

BSNL 4g: బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు డిసెంబర్‌ నుంచి ప్రారంభమవుతాయని, 2024 జూన్‌కల్లా దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని ఆ సంస్థ ఛైర్మన్‌ పుర్వార్‌ తెలిపారు.

Updated : 28 Oct 2023 20:09 IST

BSNL 4g | దిల్లీ: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఆ సంస్థ సీఎండీ పీకే పూర్వార్‌ తెలిపారు. తొలుత పంజాబ్‌ నుంచి ఈ సేవలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక్కడ జరుగుతున్న ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో భాగంగా ఆయన మీడియాతో మాట్లడారు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లైఫ్‌టైమ్‌ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్ అకౌంట్‌.. ఫ్రీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలకు సంబంధించి ఇప్పటికే 200 ప్రదేశాల్లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు పుర్వార్‌ తెలిపారు. తొలి దశలో పంజాబ్‌లో కొన్ని చోట్ల ఈ సేవలు ప్రారంభించి.. దశలవారీగా ఇతర ప్రాంతాల్లో విస్తరిస్తామని చెప్పారు. 2024 జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 4జీ విస్తరణ పూర్తయ్యాక 5జీ సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని 4జీ కోసం వినియోగించినట్లు పుర్వార్‌ తెలిపారు. 4జీ నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్‌ చేసే బాధ్యతను ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్‌, ప్రభుత్వరంగ ఐటీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. 5జీ సేవలను ప్రారంభించేందుకు కావాల్సిన స్పెక్ట్రమ్‌ అందుబాటులో ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని