బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లైఫ్‌టైమ్‌ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్ అకౌంట్‌.. ఫ్రీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌

Bank of Baroda bob LITE Savings Account: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త సేవింగ్స్‌ అకౌంట్‌ను తీసుకొచ్చింది. ఇది పూర్తిగా జీరో బ్యాలెన్స్‌ అకౌంట్. పూర్తి వివరాలు ఇవే..

Published : 28 Oct 2023 12:21 IST

Bank of Baroda savings account | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda).. బీఓబీ లైట్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ పేరిట లైఫ్‌టైమ్‌ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ను తీసుకొచ్చింది. బీఓబీ పండగ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ అకౌంట్‌ను ప్రకటించింది. మినిమమ్‌ బ్యాలెన్స్‌ అవసరం లేకుండానే ఈ ఖాతాతో బ్యాంకింగ్‌ సేవలను ఆనందించొచ్చని బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ అకౌంట్‌తో పాటు కస్టమర్లు లైఫ్‌టైమ్‌ ఉచిత రూపే ప్లాటినమ్‌ డెబిట్‌ కార్డును కూడా పొందొచ్చు. దీనికి త్రైమాసికంలో సగటు బ్యాలెన్స్‌ మెయింటెయిన్‌ చేయాలి. అలాగే అర్హత ఆధారంగా లైఫ్‌టైమ్‌ ఫ్రీ క్రెడిట్‌ కార్డును కూడా జారీ చేస్తారు. ఇప్పటికే వివిధ కన్జ్యూమర్‌ బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు వివిధ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. రిలయన్స్‌ డిజిటల్‌, క్రోమా, మేక్‌ మై ట్రిప్‌, అమెజాన్‌, బుక్‌ మై షో, మింత్రా, స్విగ్గీ, జొమాటోలో కొనుగోళ్లపై స్పెషల్‌ ఆఫర్లు లభిస్తాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక టాటా వారి ఐఫోన్స్‌.. విదేశాలకూ ఎగుమతి

బీఓబీ లైట్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ ఫీచర్లు ఇవే..

ఇది లైఫ్‌టైమ్‌ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ అకౌంట్‌. 10 ఏళ్లు పైబడిన వారు మొదలుకొని భారతీయ పౌరులెవరైనా ఈ ఖాతాను తెరవొచ్చు. ఫ్రీ రూపే ప్లాటినమ్‌ డెబిట్‌ కార్డు అందిస్తారు. మెట్రో/అర్బన్‌లో రూ.3వేలు; సెబీ అర్బన్‌లో రూ.2వేలు; గ్రామీణ శాఖల్లో రూ.1000 చొప్పున త్రైమాసిక సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అర్హతను బట్టి లైఫ్‌టైమ్‌ ఫ్రీ క్రెడిట్‌ కార్డును కూడా జారీ చేస్తారు. ఒక ఆర్థిక సవత్సరంలో 30 చెక్‌ లీవ్స్‌ ఉచితంగా లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని