300 Mbps ఇంటర్నెట్‌ + OTT ప్రయోజనాలతో BSNL బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌

BSNL Broadband Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు సంబంధించి రూ.1799తో మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది.

Updated : 18 Jul 2023 14:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ ‘భారత్‌ సంచార్ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL)’ మరో బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్ (Broadband Plans) తీసుకొచ్చింది. భారత్‌లో టాప్‌ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లలో ఒకటైన ఈ టెలికాం సంస్థ.. ఇప్పటికే 300 Mbpsతో, 4TB డేటా, ఓటీటీల సదుపాయంతో అనేక నెలవారీ ప్లాన్లను అందించింది. ఇప్పుడు రూ.1799తో మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది.

ఇప్పటికీ పెద్ద షేర్లే చౌక

ఫైబర్‌ అల్ట్రా ఓటీటీ (Fibre Ultra OTT) పేరుతో BSNL ఈ ప్లాన్‌ను తమ కస్టమర్లకు పరిచయం చేసింది. రూ.1799తో వచ్చే ఈ ప్లాన్‌తో 300 Mbps వేగంతో 4000GB లేదా 4TB నెలవారీ డేటాను పొందొచ్చు. డిస్నీ+హాట్‌స్టార్‌, లయన్స్‌గేట్‌, షెమరూమీ, హంగామా, సోనీలివ్ ఓటీటీలను వీక్షించే సదుపాయం ఉంది. ఈ ప్లాన్ గడువు ముగిసేలోగా డేటా లిమిట్ అయిపోతుందని చింతించాల్సిన పనిలేదు. ఎందుకంటే  4TB డేటా అయిపోయాక కూడా 15 Mbps వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌తో పాటు ఫిక్స్‌-లైన్‌ వాయిస్‌ కాలింగ్ సదుపాయం కూడా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను అందించే ఈ ప్లాన్‌లో ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ కావాలంటే మాత్రం డబ్బులు కట్టాల్సిందే. అయితే ఎక్కువ డేటా పొందాలనుకొనే వారు రూ.2,299 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో 4.5టీబీ డేటా లభిస్తుంది. దాంతో పాటు రూ.1799 ప్లాన్‌లో ఉన్న సదుపాయాలే ఇందులోనూ ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని