ఫైబర్‌ యూజర్ల కోసం BSNL నుంచి వాట్సాప్‌ చాట్‌బాట్‌

బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ వాట్సప్‌ చాట్‌బాట్‌ సేవలను ప్రారంభించింది. 1800 4444 నంబర్‌కు వాట్సప్‌లో హాయ్‌ అని పంపంపించి ఫైబర్‌ సేవలు పొందొచ్చు.

Published : 20 Nov 2023 14:19 IST

BSNL Whatsapp | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) కొత్తగా వాట్సప్‌ చాట్‌బాట్‌ సేవలను ప్రారంభించింది. ఫైబర్‌ కస్టమర్ల సర్వీస్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ యూజర్లు 1800 4444 నంబర్‌కు వాట్సప్‌లో హాయ్‌ అని పంపితే కొన్ని సేవలు లభిస్తాయి. 

ఈ వాట్సప్‌ చాట్‌బాట్‌ ద్వారా యూజర్లు ల్యాండ్‌లైన్‌/ FTTH బిల్లులనుపే చేయొచ్చు. అలాగే, కొత్త బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ల్యాండ్‌లైన్‌ బిల్లులు, యూసేజ్‌ వివరాలను చూసుకోవడంతో పాటు వాటిని పీడీఎఫ్‌ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లావాదేవీ వివరాలను పొందొచ్చు. ఈ చాట్‌బాట్‌ ద్వారా ఫిర్యాదులూ చేయొచ్చు. కావాలనుకుంటే తమ బ్రాండ్‌బ్యాండ్‌ ప్లాన్‌లు సైతం మార్చుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని