BSNL: బీఎన్‌ఎన్‌ఎల్ అమృత్‌ ఉత్సవ్‌ ఆఫర్‌.. ఫ్రీగా ఇంటర్నెట్‌ స్పీడ్ పెంచుకోవచ్చు..!

BSNL: ప్రముఖ టెలికాం సంస్థ భారత్ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్ తన బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చింది. ఉచితంగా ఇంటర్నెట్‌ స్పీడ్ అప్‌గ్రేడ్‌ చేసుకొనే అవకాశం కల్పించింది.

Updated : 16 Aug 2023 13:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ‘భారత్ ఫైబర్‌ అమృత ఉత్సవ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌తో బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు ఉచితంగా ఇంటర్నెట్‌ స్పీడ్‌ను 100 Mbpsకు పెంచుకొనే సదుపాయాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ హై స్పీడ్ ఇంటర్నెట్‌ను 10 రోజుల పాటు వినియోగించవచ్చని తెలిపింది.

కాగా.. ఈ ఆఫర్‌ నెల రోజుల పాటు అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 15 వరకు ఈ ఆఫర్ లభిస్తుంది. అయితే ఈ లిమిటెడ్‌ టైమ్‌ ఆఫర్‌.. బీఎస్‌ఎన్‌ఎల్ ఎఫ్‌టీటీహెచ్‌ (FTTH) సర్కిల్‌లో ఉన్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లు టెలికాం తెలిపింది. నెలవారీ రూ.449, రూ.499, రూ.599, రూ.666 రీఛార్జితో సేవలు వినియోగిస్తూ ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్న యూజర్లు మాత్రమే ఈ ఆఫర్‌ నుంచి లబ్ది పొందవచ్చు. ఈ ఆఫర్‌ను ఎలా పొందాలంటే..

మీ క్రెడిట్ కార్డ్‌ లిమిట్‌ తగ్గిందా? ఇది కారణం కావొచ్చు..!

  • ముందుగా ‘My BSNL App’ను డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో రిజిస్టర్‌ అవ్వాలి.
  • అందులో ఎఫ్‌టీటీహెచ్‌ (FTTH) అకౌంట్‌ నంబర్‌ యాడ్ చేయాలి.
  • మీ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌కు ఇంటర్నెట్ స్పీడ్‌ పెంచుకొనేందుకు అర్హత ఉందో లేదో అక్కడ తెలుస్తుంది. 
  • అకౌంట్‌ నంబర్‌ ఎంటర్ చేశాక, మీరు రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది దాని సాయంతో వెరిఫికేషన్ పూర్తవుతుంది.
  • రిజిస్ట్రేషన్‌ పూర్తయిన 48 గంటల్లోనే మీ ఇంటర్నెట్ స్వీడ్ 100 Mbps వరకు పెరుగుతుంది.
  • బూస్ట్‌ అయిన ఇంటర్నెట్‌ స్పీడ్‌ను 10 రోజుల పాటు ఆనందించవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని