Instagram: ఇన్‌స్టా యూజర్లకు కొత్త ఫీచర్‌.. కామెంట్‌ సెక్షన్‌లో పోల్స్‌

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల కోసం మెటా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

Published : 21 Oct 2023 15:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెటా (Meta)కు చెందిన ప్రముఖ ఫొటో/వీడియో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) మరో ఫీచర్‌ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కామెంట్‌ సెక్షన్‌లో పోల్స్‌ పెట్టేలా కొత్త ఫీచర్‌ని తన యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మోస్సేరి తెలిపారు. సంబంధిత ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లోని కామెంట్‌ సెక్షన్‌ను మరింత ఆసక్తిగా మార్చటంపై మెటా దృష్టి సారించింది. అందులో భాగంగానే కామెంట్‌ సెక్షన్‌లో పోల్‌ నిర్వహించే ఫీచర్‌ని తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు కేవలం ఇన్‌స్టా స్టోరీల్లో మాత్రమే పోల్స్‌ నిర్వహించేందుకు అవకాశం ఉండేది.

ఫ్లిప్‌కార్ట్‌ నుంచి మరో సేల్‌.. ఈ కార్డులపై డిస్కౌంట్స్‌

ఇకపై సాధారణ ఫోస్టులు, రీల్స్‌.. ఈ రెండింటి కామెంట్‌ సెక్షన్లలో పోల్స్‌ నిర్వహించవచ్చనమ్నాట.  పోల్‌లో పాల్గొన్న వారి సంఖ్యను చూడొచ్చు. అయితే పోల్‌లు పోస్ట్ చేసిన తర్వాత ఎంతకాలం ఉంటాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలోనే ఉంది. త్వరలోనే వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని