Flipkart: త్వరలో ఫ్లిప్‌కార్ట్ కొత్త మెంబర్‌షిప్‌ ప్రోగ్రామ్‌

ఫ్లిప్‌కార్ట్‌ మరో కొత్త మెంబర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ప్రస్తుతం ఉన్న ప్లస్ మెంబర్‌షిప్‌ కంటే కొత్తగా రాబోయే దానిలో మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.

Published : 24 Jul 2023 15:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఈ-కామర్స్ (e-commerce) సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కొత్త మెంబర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ ప్రీమియం (Flipkart Plus Premium) పేరుతో తీసుకురాబోతున్న ఈ మెంబర్‌షిప్‌తో యూజర్లకు అదనపు ప్రయోజనాలు చేకూరనున్నాయి. దీని కోసం యూజర్లు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఈ మెంబర్‌షిప్‌ పూర్తిగా ఉచితం. రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం. ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే మరిన్ని బిగ్‌ సేవింగ్‌ డే సేల్స్‌ను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో కొత్త మెంబర్‌షిప్‌ను తీసుకురావడం ద్వారా అమ్మకాలు పెంచుకోవాలని భావిస్తోంది. 

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15శాతం.. కేంద్రం ఓకే

ప్రస్తుతం.. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ (Flipkart Plus) మెంబర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో తరచుగా షాపింగ్ చేసే వారికి రివార్డు పాయింట్ల కింద సూపర్‌ కాయిన్స్‌ను ఇస్తుంది. అలా, 200 సూపర్‌ కాయిన్స్ పొందిన యూజర్‌కు ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ మెంబర్‌షిప్‌ లభిస్తుంది. ఈ మెంబర్‌షిప్‌ పొందిన యూజర్లు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే ప్రతి వంద రూపాయలకు ఒక సూపర్‌ కాయిన్‌ లభిస్తుంది. వీటిని ఫ్లిప్‌కార్ట్‌ వర్చువల్‌ కరెన్సీగా పిలుస్తారు. ఈ సూపర్‌ కాయిన్స్‌తో యూజర్లు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్లు చేయొచ్చు. అలాగే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లకు ఉచిత డెలివరీ, సాధారణ యూజర్ల కంటే ముందుగానే ఆఫర్లను ప్రకటించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. త్వరలో రాబోయే ప్లస్‌ ప్రీమియం మెంబర్‌షిప్‌ కింద ఇంతకు మించిన అదనపు ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని