EPFO Interest Rate: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15శాతం.. కేంద్రం ఓకే

EPFO Interest Rate: 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.15శాతంగా నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 0.05శాతం ఎక్కువ.

Updated : 24 Jul 2023 13:56 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు (Interest Rate) ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15శాతం వడ్డీ ఇవ్వాలని సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ (CBT) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో (EPFO) సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15శాతం వడ్డీ (EPFO Interest Rate) ఇవ్వాలని ఈ ఏడాది మార్చిలో ఈపీఎఫ్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ట్రస్టీ (సీబీటీ) నిర్ణయం తీసుకుంది. 2021-22లో ఇచ్చిన 8.10శాతంతో పోల్చితే ఇది 0.05% అధికం. ఈ నిర్ణయాన్ని సీబీటీ.. కేంద్ర ఆర్థిక శాఖకు పంపించింది. తాజాగా ఆర్థికశాఖ కూడా ఇందుకు అనుమతించడంతో వడ్డీరేటుపై ఈపీఎఫ్‌వో ప్రకటన చేసింది. కేంద్రం నుంచి ఆమోదం లభించడంతో ఈపీఎఫ్‌వో ఫీల్డ్‌ అధికారులు త్వరలోనే ఈ వడ్డీ మొత్తాన్ని 6 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

జియో నుంచి మరో ల్యాప్‌టాప్‌.. ₹20 వేల్లోపే..?

2022 మార్చిలో ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించిన విషయం తెలిసిందే. 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2021-22 ఏడాదికి 8.1 శాతానికి తగ్గించింది. 1977-78 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం వడ్డీ ఇవ్వగా.. ఆ తర్వాత 2021-22 ఏడాదిదే అత్యంత తక్కువ వడ్డీ రేటు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.8 శాతం ఉండగా.. అప్పటి నుంచి ఒక్క ఏడాది మినహా వడ్డీ రేటు క్రమంగా తగ్గించారు. తాజాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును స్వల్పంగా పెంచడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని