హోండా నుంచి కొత్త విద్యుత్‌ ఎస్‌యూవీ

Eenadu icon
By Business News Desk Published : 30 Oct 2025 02:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

టోక్యో: జపాన్‌ వాహన దిగ్గజం హోండా మోటార్‌ కంపెనీ, కొత్త తరం విద్యుత్‌ ఎస్‌యూవీ మోడల్‌ ‘హోండా 0 ఏ (ఆల్ఫా)’ను బుధవారం ఆవిష్కరించింది. 2027లో ఈ కారు భారత విపణిలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. జపాన్‌ మొబిలిటీ షో 2025లో కంపెనీ ఈ కారు నమూనాను ప్రదర్శించింది. 2027లో హోండా 0 ఏను అంతర్జాతీయంగా విడుదల చేస్తామని.. ముఖ్యంగా జపాన్, భారత విపణుల కోసం అభివృద్ధి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. మన దేశంలో కంపెనీకి హోండా 0 ఏ మొదటి విద్యుత్‌ వాహన మోడల్‌ కానుంది. 

2050 నాటికి అన్ని ఉత్పత్తులు, కార్పొరేట్‌ కార్యకలాపాల్లో కర్బన తటస్థాన్ని సాధించాలన్న ప్రతిష్ఠాత్మక లక్ష్యం దిశగా హోండా పనిచేస్తోందని కంపెనీ డైరెక్టర్, అధ్యక్షుడు తొషిహిరో మిబే పేర్కొన్నారు. విద్యుత్‌ వాహన రంగంలో మార్కెట్‌ ప్రస్తుతం అనిశ్చితంగా ఉన్నా.. దీర్ఘకాలంలో విద్యుత్‌ వాహనాల దిశగా మార్పులొస్తాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఆకర్షణీయ విద్యుత్‌ వాహనాలను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 

  • ఈ ఏడాది జనవరిలో కంపెనీ హోండా 0 సలూన్, హోండా 0 ఎస్‌యూవీలను కంపెనీ తీసుకొచ్చింది. తాజాగా హోండా 0 సిరీస్‌లో 0ఏ ఆల్ఫాను చేర్చనుంది. సున్నా ఉద్గారాల లక్ష్యంలో భాగంగా 0 శ్రేణిలో కార్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. 
  • 2028 మార్చికి జపాన్‌లో హోండా 0 సిరీస్‌ కార్లు విక్రయానికి రానున్నాయి. వచ్చే కొన్నేళ్లలో భారత్‌లో కూడా పలు విద్యుత్‌ మోడళ్లను తీసుకురావడానికి హోండా సన్నాహాలు చేస్తోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు