Google Gemini: జెమిని వాడకంపై యూజర్లకు గూగుల్ కీలక సూచన

గూగుల్‌ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ జెమిని వాడకంపై యూజర్లకు కీలక సూచన చేసింది.

Published : 14 Feb 2024 02:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌ (Google) సంస్థ గతేడాది చివర్లో జెమిని (Gemini AI) పేరుతో అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ను పరిచయం చేసింది. గతంలో ఉన్న బార్డ్‌ (Google Bard)ను కూడా ఇందులో విలీనం చేసింది. ఇది కచ్చితత్వంతో వేగవంతమైన ఫలితాలు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. తాజాగా జెమిని వాడకంపై యూజర్లకు గూగుల్‌ కీలక సూచనలు చేసింది. ఈ ఏఐ టూల్‌ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే క్రమంలో లేదా సమాచారం తెలుసుకునే సమయంలో వ్యక్తిగత, సున్నితమైన డేటాని షేర్‌ చేయొద్దని సూచించింది.

‘‘జెమిని యాప్‌ లేదా వెబ్‌సైట్‌లు గూగుల్ అసిస్టెంట్‌కి అత్యంత అడ్వాన్స్‌డ్ వెర్షన్‌. దీని ద్వారా మీరు ఏదైనా సమాచారం తెలుసుకున్న అనంతరం హిస్టరీని యూజర్‌ డిలీట్‌ చేసినా.. రివ్యూ కోసం మరికొంత కాలం గూగుల్‌ డేటాలో ఉంటాయి. భాష, డివైజ్‌, ప్రాంతం, ఫీడ్‌బ్యాక్‌ కోసం రివ్యూ చేస్తారు. వీటికి గూగుల్‌ ఖాతాలతో ఎలాంటి సంబంధం ఉండదు. యూజర్‌ తన డివైజ్‌లో జెమిని యాక్టివిటీని డిసేబుల్‌ చేసినా.. అప్పటి వరకు సెర్చ్‌ చేసిన సమాచారం వివరాలు 72 గంటలపాటు స్టోర్‌ అవుతాయి. కొన్నిసార్లు ఈ సమాచారం మూడేళ్లపాటు గూగుల్‌ స్టోరేజ్‌లో ఉంటుంది’’ అని గూగుల్ జెమిని యాప్‌ ప్రైవసీ బ్లాగ్‌లో పేర్కొంది. 

వాలంటైన్స్‌ డే.. డేటింగ్‌ యాప్‌లలో సైబర్‌ నేరగాళ్లు వెయిటింగ్‌

కొన్నిసార్లు యూజర్‌ ప్రమేయం లేకుండా జెమిని సర్వీస్‌ ప్రారంభమవుతుందని తెలిపింది. ఉదాహరణ ‘హేయ్‌ గూగుల్‌’ కమాండ్‌ను పోలిన సౌండ్‌ వినిపించినా.. జెమిని యాక్టివేట్‌ అవుతుందని బ్లాగ్‌లో వెల్లడించింది. గతేడాది డిసెంబరులో జెమిని 1.0 వెర్షన్‌ను మూడు వేరియంట్లలో గూగుల్‌ తీసుకొచ్చింది. జెమిని అల్ట్రా (Gemini Ultra), జెమిని ప్రో (Gemini Pro), జెమిని నానో (Gemini Pro). ఇది డేటా సెంటర్ల నుంచి మొబైల్‌ డివైజ్‌ల వరకు అన్నింటిలో పనిచేస్తుందని గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని