Google passkeys: గూగుల్‌ ఖాతాలకు ‘పాస్‌కీ’ ఇక డీఫాల్ట్‌..!

Google passkeys: ఇప్పటివరకు కేవలం ఆప్షన్‌గా మాత్రమే తీసుకొచ్చిన పాస్‌కీ సదుపాయాన్ని గూగుల్‌ డీఫాల్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

Published : 13 Oct 2023 19:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ (Google) తీసుకొచ్చిన పాస్‌కీ (passkeys) సదుపాయాన్ని డీఫాల్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంత వరకు కేవలం ఆప్షనల్‌ గానే తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ను.. ఇకపై డీఫాల్ట్‌ కానుంది. అంటే ఒకసారి పాస్‌కీని మీ డివైజ్‌కు లింక్‌ చేస్తే.. పాస్‌వర్డ్‌, టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ అవసరం లేకుండా గూగుల్‌ ఖాతాలో సైన్‌ ఇన్‌ అవ్వొచ్చు.

సైన్‌-ఇన్‌ కోసం సాధారణంగా వినియోగించే పాస్‌వర్డ్‌ల స్థానంలో గూగుల్‌ ఈ పాస్‌కీని తీసుకొచ్చింది. తరచూ తమ ఆన్‌లైన్‌ ఖాతాలకు పాస్‌వర్డ్‌ మర్చిపోయే యూజర్లకు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ ఆన్‌లైన్‌ ఖాతాలను పాస్‌వర్డ్‌, టూ-స్టెప్‌ వెరిఫికేషన్‌ అవసరం లేకుండా ఫింగర్‌ప్రింట్, ఫేస్‌ స్కాన్‌ లేదా లాక్‌ పిన్‌ సాయంతో లాగిన్‌ చేయొచ్చు. దీంతో యూజర్ల ఖాతాలకు అదనపు భద్రత ఉంటుందని గూగుల్ తెలిపింది. అయితే ఈ ఫీచర్‌ ఇంతవరకు కేవలం ఆప్షనల్‌గా మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ ఫీచర్‌ని డీఫాల్ట్‌ చేసింది. పాస్‌కీలను ప్రోత్సహిస్తూ పాస్‌వర్డ్‌లను అరుదుగా వినియోగించేలా చేయనున్నట్లు గూగుల్ తన బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపింది. కావాలనుకుంటే పాస్‌కీ ఆప్షన్‌ను తొలగించి పాస్‌వర్డ్‌ను ఎంచుకోవచ్చని గూగుల్‌ తెలిపింది.

రెండు బ్యాంకులు సహా ఫైనాన్స్ సంస్థకు ఆర్‌బీఐ జరిమానా

ఎలా పనిచేస్తుంది..?

ఈ పాస్‌కీ సాయంతో ఏదైనా గూగుల్‌ అకౌంట్‌ను తెరవాలంటే సదరు డివైజ్‌లో పాస్‌కీని క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సారి పాస్‌కీని సెట్‌ చేసుకుంటే.. ఇకపై పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం ఉండదు. పాస్‌కీని ఎనేబుల్‌ చేసుకోవడం కోసం గూగుల్‌ అకౌంట్‌ ప్రొఫైల్‌ (myaccount.google.com)లోకి వెళ్లాలి. అందులో మేనేజ్‌ యువర్‌ గూగుల్ అకౌంట్‌ (Manage Your Google Account)పై క్లిక్‌ చేసి సెక్యూరిటీ (Security)సెక్షన్‌ ఎంచుకోవాలి. అందులో కనిపించే పాస్‌కీస్‌ (Passkeys) అనే ఆప్షన్‌ను ఎంచుకుని స్క్రీన్‌పై చూపించే సూచనలు పాటించి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆపై పాస్‌కీ సాయంతో సులువుగా సైన్‌- ఇన్‌ అవ్వొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని