Google One Diwali Offer: గూగుల్ వన్‌ దీపావళి ఆఫర్‌.. రూ.11కే 2TB వరకు స్టోరేజ్!

Eenadu icon
By Business News Team Published : 17 Oct 2025 00:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Google One Diwali Offer | ఇంటర్నెట్‌ డెస్క్‌: దీపావళి సందర్భంగా గూగుల్‌ వన్‌ స్టోరేజీకి సంబంధించి గూగుల్‌ స్పెషల్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.11కే లైట్‌, బేసిక్‌, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్‌లను పొందొచ్చు. ఈ ఆఫర్‌ ద్వారా గూగుల్‌ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్‌లో అదనపు క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. మూడు నెలలు పాటు మాత్రమే తగ్గించిన ధరలు అమల్లో ఉంటాయి. తర్వాత సాధారణ ధరలు అమల్లోకి వస్తాయి. ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గూగుల్‌ తెలిపింది.

మంత్లీ ప్లాన్‌లు..

  • గూగుల్‌ లైట్‌ ప్లాన్‌ కింద 30జీబీ స్టోరేజ్ లభిస్తుంది. దీని ధర సాధారణంగా నెలకు రూ.30 కాగా.. ఈ ఆఫర్‌లో రూ.11కే లభిస్తుంది.
  • బేసిక్‌ ప్లాన్‌లో భాగంగా 100జీబీ స్టోరేజ్‌ అందిస్తుంది. మామూలుగా దీని ధర రూ.130 కాగా.. ఆఫర్‌లో రూ.11కే అందిస్తోంది. 
  • రూ.210కి స్టాండర్డ్‌ ప్లాన్‌లో భాగంగా 200జీబీ స్టోరేజ్‌ అందుబాటులో ఉండగా ఈ ప్లాన్‌ కూడా రూ.11కే లభిస్తుంది.
  • ఈ ఆఫర్‌లో అత్యంత లాభదాయకమైనది ప్రీమియమ్‌ ప్లాన్‌. ఇది 2టీబీ వరకు స్టోరేజ్‌ను అందిస్తుంది. సాధారణంగా దీని ధర నెలకు రూ.650 కాగా, ప్రస్తుతం దీపావళి ఆఫర్‌లో మూడు నెలల పాటు రూ.11కే పొందవచ్చు.

వార్షిక ప్లాన్‌లు

గూగుల్‌ వన్‌ వార్షిక ప్లాన్‌లపై కూడా దీపావళి ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ ద్వారా సాధారణ ధరలతో పోలిస్తే 37 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. వార్షిక లైట్‌ ప్లాన్‌ ధర రూ.708 కాగా ఆఫర్‌లో రూ.479కే పొందొచ్చు. అంటే రూ.229 ఆదా అవుతాయి. బేసిక్‌ ప్లాన్‌ ధర రూ.1,560 కాగా ఆఫర్‌లో రూ.1000కి లభిస్తుంది. స్టాండర్డ్‌ ప్లాన్ ధర రూ.2,520 కాగా ఆఫర్‌లో భాగంగా రూ.1600కే లభిస్తుంది. ప్రీమియమ్‌ వార్షిక ప్లాన్‌ సాధారణంగా రూ.7,800 ఉండగా ఆఫర్‌లో రూ.4,900కే అందుబాటులో ఉంది. అంటే వినియోగదారులు దాదాపు రూ.2,900 ఆదా చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు