Whatsapp anti spam: వాట్సప్‌లో యాంటీ స్పామ్‌ ఫీచర్‌.. ఆ మెసేజ్‌లపై లిమిట్‌!

Eenadu icon
By Business News Team Published : 21 Oct 2025 14:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Whatsapp anti spam | ఇంటర్నెట్‌ డెస్క్: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్ వాట్సప్‌ స్పామ్‌ మెసేజ్‌లను నియంత్రించేందుకు సిద్ధమవుతోంది. కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తులకు లేదా రిప్లై ఇవ్వని యూజర్లకు పంపగలిగే మెసేజ్‌లపై నెలవారీ పరిమితిని విధించాలని చూస్తోంది. ఈ మేరకు వాట్సప్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో అవసరం లేని నోటిఫికేషన్లు, ప్రమోషనల్‌ సందేశాలు తగ్గించి, యూజర్ల ఇన్‌బాక్స్‌ను క్లీన్‌గా ఉంచేలా కంపెనీ ఆలోచన చేస్తోందని ‘టెక్‌క్రంచ్‌’ పేర్కొంది.

ప్రారంభంలో వ్యక్తిగత చాటింగ్‌ కోసం రూపొందించిన ఈ యాప్‌ ప్రస్తుతం కమ్యూనిటీలు, బిజినెస్‌ అకౌంట్లు, కస్టమర్‌ సర్వీస్‌ ఛానెల్స్‌తో విస్తరించింది. దీంతో తెలియని వారి నుంచి వచ్చే అనవసర సందేశాలు పెరిగి యూజర్లకు ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో వాట్సప్‌ కాంటాక్ట్‌లో లేని, రిప్లై ఇవ్వని వ్యక్తులకు పంపే మెసేజ్‌లపై నెలవారీ పరిమితి విధించేందుకు వాట్సప్‌ సిద్ధమైంది. ఉదాహరణకు మీరు ఒక కొత్త కాంటాక్ట్‌కు మూడు మెసేజ్‌లు పంపిన తర్వాత.. వారి నుంచి ఎటువంటి రిప్లై రాకపోతే ఆ మూడు మెసేజ్‌లు మీ నెలవారీ పరిమితి లెక్కలోకి వస్తాయి. అయితే కచ్చితమైన పరిమితిని వాట్సప్‌ వెల్లడించలేదు. 

ఈ అప్‌డేట్‌కు సంబంధించి వేర్వేరు స్థాయిల్లో టెస్టింగ్‌ చేస్తున్నట్లు టెక్‌క్రంచ్‌ తెలిపింది. పరిమితికి దగ్గరయ్యే యూజర్లకు యాప్‌లో వార్నింగ్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. నిర్ణీత పరిమితికి మించితే కొత్త కాంటాక్ట్‌లకు మెసేజ్‌ పంపే అవకాశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తుంది. అయితే సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. వాట్సప్‌ ఇప్పటికే స్పామ్‌ నియంత్రణకు అనేక చర్యలు చేపట్టింది. గతేడాది నుంచి మార్కెటింగ్‌ మెసేజ్‌లపై పరిమితులు, వ్యాపార మెసేజ్‌లకు unsubscribe ఆప్షన్‌, బల్క్‌ బ్రాడ్‌కాస్ట్‌ మెసేజ్‌లపై నియంత్రణలు ప్రవేశపెట్టింది. స్పామ్‌ నియంత్రణ వల్ల సాధారణ యూజర్లకు మాత్రం ఇన్‌బాక్స్‌ మరింత క్లీన్‌గా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు