Google Pixel Watch 2: రూ.39,900తో గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌ 2.. ఫీచర్లివే..!

Google Pixel Watch 2: గూగుల్‌ మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో వచ్చిన వాచ్‌తో పోలిస్తే మెరుగైన ఫీచర్లను జత చేసి పిక్సెల్‌ వాచ్‌ 2 పేరిట దీన్ని తీసుకొచ్చింది.

Published : 05 Oct 2023 12:05 IST

Google Pixel Watch 2 | ఇంటర్నెట్‌ డెస్క్‌: గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌ 2 (Google Pixel Watch 2 ) భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదలైంది. పిక్సెల్‌ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లతో పాటు వీటిని విడుదల చేశారు. గత పిక్సెల్‌ వాచ్‌తో పోలిస్తే ఈ సారి చాలా ఫీచర్లను మెరుగుపర్చినట్లు గూగుల్‌ తెలిపింది. క్వాల్‌కామ్‌ 5100 చిప్‌సెట్‌తో వచ్చిన ఈ వాచ్‌ (Google Pixel Watch 2) వచ్చేవారం నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌ 2 ధర (Google Pixel Watch 2 Price)..

గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌ 2 (Google Pixel Watch 2) మ్యాట్‌ బ్లాక్‌, షాంపెయిన్‌ గోల్డ్‌, పాలిష్డ్‌ సిల్వర్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. బ్యాండ్‌లో అనేక రకాల ఆప్షన్లు ఉండడం విశేషం. ఎల్‌టీఈ, వైఫై.. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. భారత్‌లో ఎల్‌టీఈ మాత్రమే విడుదలైంది. దీని ధర రూ.39,900. అక్టోబర్‌ 13 నుంచి ఇది ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో అందుబాటులోకి రానుంది. అయితే, పిక్సెల్‌ 8, పిక్సెల్‌ 8 ప్రో కొనుగోలు చేసేవారికి పిక్సెల్‌ వాచ్‌ 2ను ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) రూ.19,999కే అందిస్తోంది.

గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌ 2 ఫీచర్లు (Google Pixel Watch 2 Features)..

పిక్సెల్‌ వాచ్‌ 2 (Google Pixel Watch 2) 3డీ కర్వ్‌డ్‌ ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లేతో వస్తోంది. దీని గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 1,000 నిట్స్‌ వరకు ఉండడం విశేషం. స్క్రీన్‌పై కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌5 కూడా వస్తోంది. క్వాల్‌కామ్‌ 5,100 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 2జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. దీంట్లో వేర్‌ ఓఎస్‌ 4.0 ఔట్‌ ఆఫ్‌ బాక్స్‌ ఓఎస్‌ను ఇస్తున్నారు.

మార్కెట్‌లోకి గూగుల్‌ పిక్సెల్‌ 8 ఫోన్లు..ధర, ఫీచర్లివే..!

పిక్సెల్‌ వాచ్‌ 2 (Google Pixel Watch 2)లో దిక్సూచి, అల్టీమీటర్‌, యాక్సెలరోమీటర్‌, గైరోస్కోప్‌, యాంబియెంట్‌ లైట్‌ సెన్సర్‌, బారోమీటర్‌, మ్యాగ్నెటోమీటర్‌ వంటి సెన్సర్లు ఉన్నాయి. ఇతర స్మార్ట్‌వాచ్‌ల తరహాలోనే ఆరోగ్య స్థితిని తెలియజేసే అనేక ఫీచర్లు ఉన్నాయి. ఆక్సిజన్‌ మానిటర్‌, ఈసీజీ మానిటర్‌, హార్ట్‌రేట్‌ సెన్సర్‌, స్కిన్‌ టెంపరేచర్‌ సెన్సర్‌ వంటి ఆప్షన్స్‌ ఉన్నాయి. మొత్తం 40 స్పోర్ట్స్‌ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. డైలీ రెడీనెస్‌ స్కోర్‌, స్లీప్‌ స్కోర్‌, చార్ట్‌ యాక్టివ్‌ జోన్‌ మినిట్స్‌, స్లీప్‌ ప్రొఫైల్‌ వంటి హెల్త్‌, ఫిజికల్‌ యాక్టివిటీ సమాచారాన్ని కూడా రూపొందిస్తుంది.

పిక్సెల్‌ వాచ్‌ 2 (Google Pixel Watch 2)లో 306mAh బ్యాటరీని పొందుపర్చారు. ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లేలో ఉంచితే బ్యాటరీ లైఫ్‌ 24 గంటల వరకు ఉంటుందని గూగుల్‌ తెలిపింది. గతంలో వచ్చిన పిక్సెల్‌ వాచ్‌లో వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉండగా.. తాజా వాచ్‌లో కాంటాక్ట్‌ పిన్‌ ద్వారా ఛార్జ్‌ చేసుకునే ఆప్షన్‌ను ఇచ్చారు. అందుకు అవసరమైన యూఎస్‌బీ ఛార్జింగ్‌ కేబుల్‌ను వాచ్‌తో పాటే ఇస్తున్నారు. పిక్సెల్‌ వాచ్‌లో ఉన్నట్లుగానే వాచ్‌ 2లోనూ బిల్ట్‌-ఇన్‌ మైక్‌, స్పీకర్‌, సైడ్‌ బటన్‌ ఉన్నాయి. బ్లూటూత్‌ 5, వైఫై, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని