HMD feature Phones: హెచ్‌ఎండీ బ్రాండ్‌పై ఫీచర్‌ ఫోన్లు.. యూపీఐ సదుపాయంతో 105, 110 మోడళ్లు

HMD feature Phones: నోకియా బ్రాండ్‌పై ఫోన్లు తయారుచేసే హెచ్‌ఎండీ సంస్థ 105, 110 పేరిట రెండు ఫీచర్‌ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది.

Published : 12 Jun 2024 00:09 IST

HMD 110, 105 | ఇంటర్నెట్‌ డెస్క్‌: నోకియా బ్రాండ్‌పై ఫోన్లు తయారుచేస్తున్న హెచ్‌ఎండీ (HMD) సంస్థ తన సొంత బ్రాండ్‌పై రెండు ఫీచర్‌ ఫోన్లను దేశీయ మార్కెట్లో లాంచ్‌ చేసింది. హెఎండీ 110, హెచ్‌ఎండీ 105 పేరిట వీటిని తీసుకొచ్చింది. ఈ బ్రాండ్‌పై తీసుకొచ్చిన తొలి ఫోన్లు ఇవే కావడం గమనార్హం. పేరుకే ఫీచర్‌ ఫోన్‌లైనా వీటిలో కొన్ని మల్టీమీడియా ఫీచర్లు ఇస్తుండడం గమనార్హం. హెచ్‌ఎండీ 110 మోడల్‌ ధర రూ.1,119గా, 105 మోడల్‌ ధరను రూ.999గా నిర్ణయించారు. జూన్‌ 11 నుంచి హెచ్‌ఎండీ.కామ్‌, ఇ-కామర్స్‌ సైట్లు, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్లలో లభిస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

25 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన నోకియా 3210.. ఫీచర్లు ఇవే..

హెచ్‌ఎండీ 110 నలుపు, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తుంది. 105 మోడల్‌ నలుపు, నీలం, గులాబీ రంగులో లభిస్తుంది. ఈ ఫోన్లలో ఫోన్‌ టాకర్‌, ఆటోకాల్‌ రికార్డింగ్‌, ఎంపీ 3 ప్లేయర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండింటిలోనూ వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం సదుపాయం ఉంది. డ్యూయల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌, ఇన్‌బిల్ట్‌ యూపీఐ సదుపాయం ఉంది. 110 మోడల్‌లో కెమెరా సెన్సార్‌ అమర్చారు. అయితే, దానికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ ఫోన్లకు ఏడాది పాటు రీప్లేస్‌మెంట్‌ గ్యారెంటీ ఉంటుందని హెచ్‌ఎండీ వెల్లడించింది. రెండు ఫోన్లలోనూ 1000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. స్టాండ్‌ బై మోడ్‌లో ఇవి సుమారు 18 గంటల పాటు పనిచేస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని