Honor X9b: యాంటీ డ్రాప్‌ టెక్నాలజీతో హానర్‌ X9b.. ధరెంతంటే?

Honor X9b Launched: హానర్‌ ఎక్స్‌9బి స్మార్ట్‌ఫోన్‌ను దేశీయంగా లాంచ్ చేసింది. దీని ధరను రూ.25,999గా కంపెనీ నిర్ణయించింది.

Published : 15 Feb 2024 18:19 IST

Honor X9b Launched | ఇంటర్నెట్‌ డెస్క్‌: హానర్‌ 90 5జీ స్మార్ట్‌ఫోన్‌తో దేశీయ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన హానర్‌ కంపెనీ.. తాజాగా మరో ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎక్స్‌ సిరీస్‌లో ఎక్స్‌9బిని (Honor X9b) తీసుకొచ్చింది. 108 ఎంపీ కెమెరా, 5,800 ఎంఏహెచ్‌ బిగ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌.. యాంటీడ్రాప్‌ టెక్నాలజీతో వస్తోంది. ఇంతకీ హానర్ కొత్త 5జీ ఫోన్‌ ధరెంత? ప్రత్యేకతలు ఏంటి? ఆ వివరాలు..

హానర్‌ ఎక్స్‌9బి (Honor X9b) సింగిల్‌ వేరియంట్‌లో లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.25,999గా కంపెనీ నిర్ణయించింది. మిడ్‌నైట్‌ బ్లాక్‌, సన్‌రైజ్‌ ఆరెంజ్‌ రంగుల్లో లభిస్తుంది. ఫిబ్రవరి 16 నుంచి అమెజాన్‌తో పాటు రిటైల్‌ స్టోర్లలో దీన్ని విక్రయించనున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డుతో కొనుగోళ్లపై రూ.3 వేలు డిస్కౌంట్‌ లభిస్తుంది.

పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయ్‌.. సోషల్‌ మీడియాపై న్యూయార్క్‌ ప్రభుత్వం దావా

స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్‌ 13తో ఔటాఫ్‌ది బాక్స్‌ వస్తోంది. మ్యాజిక్‌ ఓఎస్‌ 7.2తో పనిచేస్తుంది. ఇందులో 1.5కె రిజల్యూషన్‌ కలిగిన కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్‌ రేటు ఉంది. అల్ట్రా బౌన్స్‌ యాంటీ డ్రాప్‌ డిస్‌ప్లే టెక్నాలజీని ఇందులో అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీనివల్ల ఫోన్‌ కింద పడినా డిస్‌ప్లేకు ఎలాంటి హానీ జరగదని కంపెనీ చెబుతోంది.

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. 108 ఎంపీ ప్రధాన కెమెరా.. 5 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా అమర్చారు. ఎన్‌ఎఫ్‌సీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఇచ్చారు. ఇందులో అమర్చిన 5,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. 35W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

ఇయర్‌ బడ్స్‌, వాచ్‌

ఇదే ఈవెంట్లో ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌ను హానర్‌ లాంచ్‌ చేసింది. హానర్‌ చాయిస్‌ ఇయర్‌ బడ్స్‌ ఎక్స్‌5 ధరను రూ.1999గా కంపెనీ నిర్ణయించింది. 30db యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో వస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 1.95 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తున్న ఛాయిస్‌ వాచ్‌ ధరను రూ.5,999గా హానర్‌ పేర్కొంది. దీని విక్రయాలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు