Infinix: 108 ఎంపీ కెమెరా, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో ఇన్‌ఫినిక్స్‌ కొత్త ఫోన్లు

Infinix Note 40 Pro series: వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో ఇన్‌ఫినిక్స్‌ రెండు కొత్త మొబైల్స్‌ని భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.

Published : 13 Apr 2024 00:04 IST

Infinix Note 40 Pro series | ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్‌ (Infinix) నోట్‌ 40ప్రో సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో 5జీ (Infinix Note 40 Pro 5G), ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో+ 5జీ (Infinix Note 40 Pro+ 5G) పేరిట వీటిని తీసుకొచ్చింది. 108 ప్రధాన కెమెరా, కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ట్రిపుల్‌ కెమెరాతో ఈ ఫోన్లు వచ్చాయి. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం కూడా ఉంది.

ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో 5జీ (Infinix Note 40 Pro 5G)లో 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేటు, 1300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ కలిగిఉంటుంది. మీడియా టెక్‌ డైమెన్‌సిటీ 7020 6nm ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత XOSతో పనిచేస్తుంది. ఇందులో 108 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ మాక్రో సెన్సర్‌, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరాను అమర్చారు. 5,000mAh బ్యాటరీతో వచ్చే మొబైల్‌ 40W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ మొబైల్‌ కేవలం ఒక వేరియంట్‌లో లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది.

టీసీఎస్‌ లాభం ₹12,434 కోట్లు.. వారికి డబుల్‌ డిజిట్‌ ఇంక్రిమెంట్‌

ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో 5జీలో ఉన్న డిస్‌ప్లే, ప్రాసెసర్‌ ఫీచర్లే ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో+ 5జీ (Infinix Note 40 Pro+ 5G)లోనూ ఉన్నాయి. ఈ మొబైల్‌లోని 5,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.24,999గా కంపెనీ పేర్కొంది. రెండు మొబైల్స్‌ 20W వైర్‌లెస్ మ్యాగ్‌ఛార్జర్‌కు సపోర్ట్‌ చేస్తాయి. అబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్, వింటేజ్ గ్రీన్ రంగుల్లో లభిస్తాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌, ఐఆర్‌ సెన్సర్, జేబీఎల్‌ స్టీరియో స్పీకర్లు, IP53 రేటింగ్, డ్యూయల్ మైక్రోఫోన్‌ సదుపాయం వీటిలో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు మొదలయ్యాయని కంపెనీ తెలిపింది. ప్రారంభ ఆఫర్‌ కింద కొనుగోలు చేసిన వారికి రూ.4,999 విలువ గల మ్యాగ్‌కిట్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ కిట్‌లో మ్యాగ్‌కేస్‌, మ్యాగ్‌ పవర్‌ బ్యాంక్‌ ఉంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2వేలు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని