iPhone 13: ఐఫోన్‌ 15 రానున్న వేళ.. ఐఫోన్‌ 13పై డిస్కౌంట్‌

iPhone prices down: ఐఫోన్‌ 15 లాంచ్‌కి సిద్ధంగా ఉన్న వేళ యాపిల్ ఐఫోన్‌ 13 ధరలు తగ్గాయి. మునుపెన్నడూ లేని తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి.

Published : 02 Sep 2023 01:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 15 (iPhone 15) సిరీస్‌ ఫోన్లు త్వరలో రాబోతున్నాయి. ఈ మోడల్‌ లాంచ్‌ కాకముందే యాపిల్ తన పాత తరం ఐఫోన్‌ 13 (iPhone 13) ధరలను తగ్గించింది. ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు అయిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తోంది. ఐఫోన్‌ 13 మోడల్‌పై బ్యాంక్‌ ఆఫర్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లతో ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్‌ 13 ధర రూ.69,900 కాగా.. ప్రస్తుతం ఈ ఫోన్‌ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ.58,999కే లభిస్తోంది. అదే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు సాయంతో ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.3 వేలు డిస్కౌంట్‌ పొందొచ్చు. అంటే ఆఫర్‌ పోనూ రూ.56,999కే లభిస్తుంది. ఇంతకుముందెప్పుడూ ఇంత తక్కువ ధరకు ఐఫోన్‌ 13 లభించలేదని టెక్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెజాన్‌లో ప్రస్తుతం కార్డు ఆఫర్లేవీ అందుబాటులో లేవు. మరికొన్ని వేదికల్లో ఎక్స్ఛేంజీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఆగస్టు జీఎస్టీ వసూళ్లలో 11 శాతం వృద్ధి

కొత్త ఫోన్‌ లాంచింగ్‌ నేపథ్యంలో గతేడాది విడుదల చేసిన ఐఫోన్‌ 14 ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని టెక్‌ నిఫుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యాపిల్ స్టోర్‌లో ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్ల ధరలు రూ.79,900 నుంచి ప్రారంభమవుతున్నాయి. మరోవైపు సెప్టెంబర్‌ 12న యాపిల్‌ మెగా ఈవెంట్‌ నిర్వహించబోతోంది.  ఈ ఈవెంట్‌లో ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లను గ్లోబల్‌గా లాంచ్‌ చేయనుంది. ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ పేరిట ఈ ఫోన్లు రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని