TRAI data: జియోదే హవా.. రెండో స్థానంలో ఎయిర్‌టెల్‌

Mobile subscribers: వొడాఫోన్‌ ఐడియా మరోసారి భారీగా కస్టమర్లను కోల్పోయింది. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్‌ తమ చందాదారులను పెంచుకున్నాయి.

Updated : 04 Jan 2024 16:37 IST

Mobile subscribers | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) యూజర్లను ఆకట్టుకోవడంలో మరోసారి ముందు వరుసలో నిలిచింది. ఎప్పటిలానే కస్టమర్లను పెంచుకోవటంలో తన హవా కొనసాగిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) కూడా కస్టమర్లను పెంచుకోగా.. వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) మాత్రం పెద్ద ఎత్తున సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. 2023 అక్టోబర్‌ నెలకు సంబంధించి ట్రాయ్‌ వెలువరించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.

మస్క్‌ కొనుగోలు తర్వాత ‘ఎక్స్‌’ విలువ 71% పతనం!

అక్టోబరులో జియో 31.59 లక్షల మంది కొత్త కస్టమర్లను తన నెట్‌వర్క్‌లోకి చేర్చుకుందని ట్రాయ్‌ పేర్కొంది. దీంతో సెప్టెంబరులో 44.92 కోట్లుగా ఉన్న జియో చందాదారుల సంఖ్య అక్టోబర్‌ నాటికి 45.23 కోట్లకు చేరిందని తెలిపింది. ఇక ఎయిర్‌టెల్‌ 3.52 లక్షల కొత్త సబ్‌స్ర్రైబర్లతో అక్టోబర్‌ నాటికి తన మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్యను 37.81 కోట్లకు పెంచుకుంది. అదే సమయంలో వొడాఫోన్‌ ఐడియా నుంచి 20.44 లక్షల మంది యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లారని ట్రాయ్‌ పేర్కొంది. దీంతో వీఐ చందాదారుల సంఖ్య 22.54 కోట్లకు తగ్గింది. అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన జియో ఎప్పటిలానే మొదటి స్థానంలో నిలవగా.. ఎయిర్‌టెల్‌ రెండు, వీఐ మూడు స్థానాల్లో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని