Jio AirFiber: ఎయిర్‌ఫైబర్‌ యూజర్లకు జియో ఆఫర్‌.. ఫ్రీగా ట్రిపుల్‌ డేటా స్పీడ్‌

Jio AirFiber data offer: ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న వేళ ఎయిర్‌ ఫైబర్‌ యూజర్లకు జియో ఆఫర్‌ ప్రకటించింది. అధిక డేటా స్పీడ్‌ను ఆఫర్ చేస్తోంది. 

Published : 20 Mar 2024 16:41 IST

Jio AirFiber | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ జియో.. ఎయిర్‌ ఫైబర్‌ (Air fiber) యూజర్లకు ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. 60 రోజుల పాటు ట్రిపుల్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది. అంటే ప్రస్తుత ప్లాన్‌ కంటే మూడింతల అధిక వేగంతో డేటాను అందివ్వనుంది. కొత్త యూజర్లతో పాటు ఇప్పటికే ఎయిర్‌ఫైబర్‌ వినియోగిస్తున్న వారికీ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. త్వరలో ఐపీఎల్‌ సీజన్‌ ఫీవర్‌ ప్రారంభం కాబోతున్న వేళ ఈ ఆఫర్‌ ప్రకటించడం గమనార్హం.

ఎయిర్‌ ఫైబర్‌ ప్లస్‌ యూజర్లకు ధన్‌ ధనా ధన్‌ ఆఫర్‌ పేరిట ఈ స్పీడ్‌ బూస్టర్‌ను జియో అందిస్తోంది. మార్చి 16 నుంచి ఈ ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ బేస్‌ప్లాన్‌ 30 ఎంబీపీఎస్‌ వినియోగిస్తుంటే.. వారికి 100 ఎంబీపీఎస్‌ వేగం లభిస్తుంది. 100 ఎంబీపీఎస్‌ ప్లాన్‌ వాడుతుంటే 300 ఎంబీపీఎస్‌; 300 ఎంబీపీఎస్‌ ప్లాన్‌పై 500 ఎంపీబీపీఎస్‌; 500 ఎంబీపీఎస్‌ ప్లాన్‌పై 1జీబీ స్పీడ్‌తో డేటా సేవలు అందుతాయి.

తప్పుడు ధ్రువీకరణలతో 21లక్షల సిమ్‌కార్డులు.. రద్దుకు డీవోటీ చర్యలు..!

కొత్త యూజర్లకు రీఛార్జి చేసిన వెంటనే ఈ ప్లాన్‌ ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్‌ అవుతుంది. పాత యూజర్లకు స్పీడ్ అప్‌గ్రేడ్‌ గురించి ఆ మేరకు ఇ-మెయిల్‌, ఎస్సెమ్మెస్‌ అందుతుంది. ఎవరైతే 6 నెలలు లేదా 12 నెలల జియో ఎయిర్‌ఫైబర్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని ఉంటారో వారికే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. సాధారణ జియో ఫైబర్‌ యూజర్లకు ఈ ఆఫర్‌ వర్తించదు. ఐపీఎల్‌ 2024  జియో సినిమాలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. 4కె రిజల్యూషన్‌లో మ్యాచ్‌లను వీక్షించే వీలుంది. ఒకవేళ డేటా సరిపోకపోతే రీఛార్జి చేసుకునేందుకు వీలుగా రూ.101, రూ.251 డేటా యాడ్‌- ఆన్‌ ప్లాన్లను కూడా జియో తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని