Jio Prepaid Plans: OTT సబ్‌స్క్రిప్షన్‌+ అన్‌లిమిటెడ్‌ డేటా.. జియోలో మరో 3 కొత్త ప్లాన్‌లు

Jio Prepaid Plans: రిలయన్స్‌ జియో కొత్తగా మరో మూడు వార్షిక ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిలో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా లభిస్తున్నాయి.

Published : 06 Oct 2023 13:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ జియో మరో మూడు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్ల (Jio Prepaid Plans)ను ప్రవేశపెట్టింది. ఏడాది కాలపరిమితితో వస్తున్న ఈ ప్లాన్లలో అపరిమిత కాలింగ్‌, డేటాతో పాటు సోనీలివ్‌ (SonyLiv), జీ5 (ZEE5) సభ్యత్వం కూడా లభిస్తుంది. జియో ఇప్పటికే అందిస్తున్న ఓటీటీ, 5జీతో కూడిన దీర్ఘకాలిక పథకాల్లో కొత్తగా ఈ మూడు ప్లాన్లు కూడా చేరనున్నాయి.

జీ5, సోనీలివ్‌తో రూ.3,662 ప్లాన్‌..

రూ.3,662తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకి 2.5 జీబీ డేటాతో 100 ఎస్సెమ్మెస్‌లు వస్తాయి. అపరిమిత 5జీ డేటాను కూడా ఎంజాయ్‌ చేయొచ్చు. దీంట్లో సోనీలివ్‌ (SonyLiv), జీ5 (ZEE5) సబ్‌స్క్రిప్షన్లు రెండూ ఉంటాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు కూడా యాక్సెస్‌ ఉంటుంది. ఈ ప్లాన్‌ గడువు 365 రోజులు.

రూ.39,900తో గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌ 2..ఫీచర్లివే..!

సోనీలివ్‌తో రూ.3,226 ప్లాన్‌..

అపరిమిత కాలింగ్‌, 5జీ డేటాతో వస్తున్న ఈ ప్లాన్‌లో రోజుకి 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. రోజుకి 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. సోనీలివ్‌ (SonyLiv), జియోటీవీ, జియో సినిమా, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్లు లభిస్తాయి.

జీ5తో రూ.3,225 ప్లాన్‌..

పై ప్లాన్‌తో పోలిస్తే ఒక్క రూపాయి తక్కువతో వస్తున్న ఈ ప్లాన్‌లో కేవలం ఒక్క ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ మాత్రమే మారుతుంది. మునుపటి దాంట్లో సోనీలివ్‌ సభ్యత్వం ఉండగా.. ఈ ప్లాన్‌లో జీ5 (ZEE5) సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. అపరిమిత కాలింగ్‌, 5జీ డేటా, రోజుకి 2జీబీ 4జీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి.

ఈ మూడు ప్లాన్లతో పాటు ఏడాది గడువుతో మరో ప్లాన్‌ను కూడా జియో ఇప్పటికే అందిస్తోంది. దీని ధర రూ.1,999. అయితే, దీంట్లో ఎలాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లూ ఉండవు. ఈ ప్లాన్‌లోనూ అపరిమిత కాలింగ్‌, అపరిమిత 5జీ డేటాతో పాటు రోజుకు 4.5జీబీ 4జీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. జియో యాప్‌లు, సర్వీస్‌లకు యాక్సెస్‌ ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని