JioPhone Prima Plans: జియోఫోన్‌ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్లు.. వివరాలివే!

JioPhone Prima Prepaid Plans: జియో ఇటీవల తీసుకొచ్చిన ప్రైమా ఫీచర్‌ ఫోన్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్ల వివరాలు బయటకు వచ్చాయి. డేటా ప్రయోజనాలతో కూడిన మొత్తం ఏడు ప్లాన్లను తీసుకొచ్చింది.

Published : 28 Nov 2023 11:19 IST

JioPhone Prima Prepaid Plans | ఇంటర్నెట్‌ డెస్క్‌: కస్టమర్లకు డిజిటల్‌ వసతులకు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో 4జీ ఫీచర్‌ ఫోన్లను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఇటీవల జియోఫోన్‌ ప్రైమాను తీసుకొచ్చింది. రూ.2,599 ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌లో యూట్యూబ్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌, యూపీఐ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, సాధారణ జియోఫోన్‌ ప్లాన్లతో మాత్రం దీన్ని రీఛార్జ్‌ చేయడం కుదరదు. దీని కోసం కంపెనీ ప్రత్యేక ప్లాన్ల (JioPhone Prima Prepaid Plans)ను తీసుకొచ్చింది. వాటి వివరాలు చూద్దాం..

జియోఫోన్‌ ప్రైమాలో మొత్తం ఏడు ప్రీపెయిడ్‌ ప్లాన్లు ఉన్నాయి. వీటన్నింటిలో డేటా ప్రయోజాలు ఉంటాయి.

  • రూ.75 ప్లాన్‌: వ్యాలిడిటీ 23 రోజులు; రోజుకి 100ఎంబీ + 200ఎంబీ డేటా; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌; 50 ఎస్‌ఎంఎస్‌లు; జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌
  • రూ.91 ప్లాన్‌: వ్యాలిడిటీ 28 రోజులు; రోజుకి 100ఎంబీ + 200ఎంబీ డేటా; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌; 50 ఎస్‌ఎంఎస్‌లు; జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌
  • రూ.125 ప్లాన్‌: వ్యాలిడిటీ 23 రోజులు; రోజుకి 0.5జీబీ డేటా; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌; 300 ఎస్‌ఎంఎస్‌లు; జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌
  • రూ.152 ప్లాన్‌: వ్యాలిడిటీ 28 రోజులు; రోజుకి 0.5జీబీ డేటా; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌; 300 ఎస్‌ఎంఎస్‌లు; జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌
  • రూ.186 ప్లాన్‌: వ్యాలిడిటీ 28 రోజులు; రోజుకి 1జీబీ డేటా; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌; రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు; జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌
  • రూ.223 ప్లాన్‌: వ్యాలిడిటీ 28 రోజులు; రోజుకి 2జీబీ డేటా; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌; రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు; జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌
  • రూ.895 ప్లాన్‌: వ్యాలిడిటీ 336 రోజులు; రోజుకి 2జీబీ డేటా; అపరిమిత వాయిస్‌ కాలింగ్‌; ప్రతి 28 రోజులకు 50 ఎస్‌ఎంఎస్‌లు; జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని