Lava O2: బడ్జెట్‌ ధరలో లావా కొత్త ఫోన్‌.. ఫీచర్లు ఇవే

Lava O2: లావా బడ్జెట్‌ ధరలో కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది. మార్చి 27 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది.

Updated : 22 Mar 2024 17:05 IST

Lava O2 | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. లావా O2 (Lava O2) పేరిట శుక్రవారం ఆవిష్కరించింది. కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే ఈ ఫోన్‌ లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.8,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ధర రూ.7,999గా ప్రకటించింది. మార్చి 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం అవుతాయని కంపెనీ తన వెబ్‌సైట్లో పేర్కొంది. లావా ఈ-స్టోర్‌తో పాటు అమెజాన్‌ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చని పేర్కొంది. 

వాట్సప్‌ పిన్‌ ఫీచర్‌ మరింత మెరుగ్గా.. ఇకపై 3 మెసేజ్‌ల వరకు

ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఆండ్రాయిడ్‌ 13తో వస్తోంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే ఇచ్చారు. UNISOC T616 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. లావా O2కు రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది. ఫోన్‌ వెనకవైపు 50 ఎంపీ డ్యూయల్‌ ఏఐ కెమెరా, సెల్ఫీ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా అమర్చారు. ఇంపీరియల్‌ గ్రీన్‌, మెజిస్టిక్‌ పర్పుల్‌, రాయల్‌ గోల్డ్‌.. రంగుల్లో ఫోన్‌ లభిస్తుంది. 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది. వైఫై, బ్లూటూత్‌, యూఎస్‌బీ టైప్‌-సీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని