Artificial Intelligence: ‘ఏఐ’ని మనుషుల్లా చూడడం ఆపాలి: సత్య నాదెళ్ల

Artificial Intelligence: ఏఐలో మనుషుల తరహా ఫీచర్లను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్న వేళ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధను మనుషుల్లా ట్రీట్‌ చేయడం ఆపాలని సూచించారు.

Updated : 22 May 2024 14:21 IST

వాషింగ్టన్‌: టెక్‌ కంపెనీలు ఏఐపై లోతైన పరిశోధనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఏఐ సాధనాల్లో మనుషుల తరహా లక్షణాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. నవ్వడం, పాడటం, వివిధ గొంతులతో మాట్లాడగలిగే పర్సనల్‌ అసిస్టెంట్‌ను ఇటీవల ఓపెన్‌ఏఐ ఆవిష్కరించింది. అయితే, ఈ తరహా ప్రయోగాలపై మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐను మనుషుల్లా భావించడం ఆపాలని సూచించారు.

ఏఐలో (Artificial Intelligence - AI) మనుషుల తరహా లక్షణాలను తీసుకురావాలనే ఆలోచన సరికాదని తాను భావిస్తున్నట్లు నాదెళ్ల వెల్లడించారు. అలాగే ఏఐని ఒక సాధనంగా మాత్రమే ట్రీట్‌ చేయాలని మనుషులకు ఉపయోగించినట్లుగా నామవాచకాలు, సర్వనామాలు వాడడంపై కూడా ఆయన భిన్నంగా స్పందించారు. ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ అనే పదజాలంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ‘డిఫరెంట్‌ ఇంటెలిజెన్స్‌’గా వ్యవహరించి ఉండాల్సిందని సూచించారు. మనుషులకు మాత్రమే ‘ఇంటెలిజెన్స్‌’ ఉంటుందని.. ప్రత్యేకంగా దాన్ని ఆర్టిఫిషియల్‌గా పొందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

‘జెమిని’.. గూగుల్‌ ఏఐ మోడల్‌కు ఆ పేరెలా వచ్చింది?

ఏఐతో పూర్తిగా వాణిజ్యపరమైన సంబంధమే ఉండాలని నాదెళ్ల సూచించారు. అవసరమైనప్పుడు సేవలందించే సాధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలని తెలిపారు. మనుషుల మధ్య బంధాన్ని రీప్లేస్‌ చేసేలా అది ఉండకూడదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని