విండోస్‌ ఫోన్‌ లింక్‌ యాప్‌లో కొత్త ఫీచర్‌.. ఫొటోలో టెక్ట్స్‌ ఇక కాపీ

విండోస్‌ ఫోన్‌ లింక్‌ యాప్‌ని మరింత అప్‌డేట్‌ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Published : 30 May 2024 00:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫోన్‌ లింక్‌ యాప్‌ను మెరుగుపరిచేందుకు మైక్రోసాఫ్ట్‌ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఫోన్‌ లింక్‌ సాయంతో కాల్స్‌, మెసేజ్ లు, నోటిఫికేషన్లు యాక్సెస్‌ చేసుకునే సదుపాయం ఉండగా.. కొత్తగా ఫొటోలపై టెక్ట్స్‌ను కాపీ చేసే సామర్థ్యాన్ని పరిచయం చేసింది. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ ఫీచర్‌.. త్వరలో అందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

ఫోన్‌ లింక్‌ యాప్‌ ద్వారా కనెక్ట్‌ చేసి డెస్క్‌టాప్‌పై చూసే ఫొటోలపై కొత్తగా టెక్స్ట్‌ బటన్‌ కనిపిస్తుందన్నమాట. ఇందుకోసం కొత్తగా ఫొటోలోని టెక్ట్స్‌ని కాపీ చేసేందుకు ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR) ఫీచర్‌ను పొందుపరిచారు. మైక్రోసాఫ్ట్ లెన్స్, మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్ వంటి కొన్ని యాప్‌లు ఇప్పటికే OCR సామర్థ్యాలను కలిగిఉన్నాయి. విండోస్‌ 10, 11లో తీసుకొచ్చిన స్నిప్‌ టూల్‌లోనూ ఈ సదుపాయం ఉంది.

ఓపెన్‌ఏఐ సీఈఓ కీలక ప్రకటన.. సగానికి పైగా సంపద దాతృత్వానికే

మొబైల్‌ని పీసీకి ఎలా కనెక్ట్‌ చేయాలి?

ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ను విండోస్‌ పీసీకి లింక్‌ చేసేందుకు మైక్రోసాఫ్ట్ లింక్‌ టు విండోస్‌ యాప్‌ను తీసుకొచ్చింది. దీంతో మీ ఫోన్‌లో వచ్చే నోటిఫికేషన్‌లు, కాల్స్‌, టెక్స్ట్‌లను డెస్క్‌టాప్‌పై చూడొచ్చు. ఈ యాప్‌ విండోస్‌ 10, 11లో డిఫాల్ట్‌గా ఉంటుంది. ఇక మీ మొబైల్‌లో దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. లేదా కొన్ని మొబైల్స్‌లో లింక్‌ విండోస్‌ అనే ఆప్షన్‌ డిఫాల్ట్‌గా ఉంటుంది. దాన్ని ఎనేబల్‌ చేసుకోవాలి. ఆపై మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌ను పీసీ, ఫోన్‌లో లాగిన్‌ అవ్వాలి. తర్వాత డెస్క్‌టాప్‌ స్క్రీన్‌పై కనిపించే ఆండ్రాయిడ్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయగానే క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. దాన్ని మొబైల్‌తో స్కాన్‌ చేస్తే.. మొబైల్‌లోని పనులన్నీ డెస్క్‌టాప్‌పై చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు