₹7 వేలకే మోటో స్మార్ట్‌ఫోన్‌.. జియో యూజర్లకు స్పెషల్ ఆఫర్‌

Moto G04 Launched: మోటోరొలా నుంచి ఎంట్రీలెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. దీని ధర రూ.6,999గా కంపెనీ నిర్ణయించింది. ఫిబ్రవరి 22 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

Published : 15 Feb 2024 21:51 IST

Moto G04 Launched | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరొలా (Motorola) ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. మోటో జీ04 పేరిట (Moto G04) ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. రూ.7వేల ధరలో స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారు ఈ ఫోన్‌ను పరిశీలించొచ్చు. అయితే, ఇది 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్‌ చేస్తుందన్నది గమనించాలి.

మోటో జీ04 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధరను రూ.6,999గా కంపెనీ నిర్ణయంచింది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.7,999గా పేర్కొంది. ఎక్స్ఛేంజీపై రూ.750 అదనంగా ఇవ్వనున్నారు. ఒకవేళ రిలయన్స్‌ జియో కస్టమర్లు అయితే రూ.399 రీఛార్జిపై రూ.2 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ (రూ.50 చొప్పున కూపన్లు), రూ.2,500 విలువైన యాత్ర, అజియో, నెట్‌మెడ్స్‌ కూపన్లు లభిస్తాయి. ఫిబ్రవరి 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, మోటోరొలా, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ లభ్యమవుతుంది.

యాంటీ డ్రాప్‌ టెక్నాలజీతో హానర్‌ X9b.. ధరెంతంటే?

6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ వస్తోంది. యూనిసోక్‌ టీ606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8జీబీ వరకు వర్చువల్‌ ర్యామ్‌ను పొడిగించుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ 14తో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారిత మై యూఎక్స్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. వెనక వైపు 16 ఎంపీ సింగిల్‌ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్‌, ముందువైపు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు. ఇది 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, డాల్బీ అట్మోస్‌ సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్‌ సదుపాయం కూడా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని