Motorola: మోటోరోలా ఆఫర్‌.. ఫ్లిప్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్‌

Motorola: మోటోరోలా రెండు ఫ్లిప్‌ మొబైల్స్‌పై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ అందిస్తోంది. రూ.10వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

Updated : 19 Dec 2023 14:39 IST

Motorola | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా (Motorola) తన ఫ్లిఫ్ ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్ ప్రకటించింది. కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఫ్లిప్‌ ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 24 వరకు అందుబాటులో ఉండనుంది. రేజర్‌ 40 (Razr 40), రేజర్‌ 40 అల్ట్రా (Razr 40 Ultra) మొబైల్ ఫోన్లపై రూ.10వేల డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు డిసెంబరు 15న సంస్థ ప్రకటించింది.

యాపిల్‌ వాచ్‌లపై నిషేధం కత్తి.. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కోసం ఉరుకులు పరుగులు

డిసెంబరు 18 నుంచి 24 మధ్య మోటో డేస్‌లో కొనుగోలు చేసిన వారికి ఈ మొబైల్స్‌పై అదనపు తగ్గింపును అందిస్తున్నట్లు పేర్కొంది. రేజర్‌ 40 అల్ట్రా మొబైల్‌ ఫోన్‌ రూ.10వేల డిస్కౌంట్‌తో ధర రూ.79,999గా ఉండగా.. దీనిపై రూ.7 వేల అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. అంటే ఈ మొబైల్‌ని రూ.72,999కే కొనుగోలు చేయొచ్చు. ఇక  రేజర్‌ 40 మొబైల్‌ని అదనంగా రూ.5 వేల తగ్గింపుతో రూ.44,999కే అందిస్తోంది. 9 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని