Marc Randolph: నా సక్సెస్‌ రూల్స్‌ ఇవే.. తండ్రి చేతిరాతను పోస్ట్‌ చేసిన నెట్‌ఫ్లిక్స్‌ కో- ఫౌండర్‌

Marc Randolph: నెట్‌ఫ్లిక్స్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ రాండోల్ఫ్‌ తన తండ్రి అందించిన కొన్ని సూచనలను ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు.

Published : 08 Jun 2024 00:04 IST

Marc Randolph | ఇంటర్నెట్‌డెస్క్‌: సవాళ్లను అధిగమిస్తూ కంపెనీలను నడిపిస్తున్న సీఈఓలు, వ్యాపార దిగ్గజాలు, ప్రముఖ సంస్థల ఎండీలు.. ఇలా ఎందరో సోషల్‌మీడియా వేదికగా కెరియర్‌ సలహాలు, సూచనలు చేస్తుంటారు. అంతేకాదు తమ జీవితంలో జరిగిన సంఘటనలు, ఎదురైన అనుభవాలను ఫాలోవర్లతో పంచుకుంటుంటారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ మార్క్ రాండోల్ఫ్ (Marc Randolph) కూడా ఓ విషయాన్ని పంచుకున్నారు. ఉద్యోగం మొదలుపెట్టేముందు తన తండ్రి చెప్పిన 8 టిప్స్‌ను ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. 

  • అడిగిన దానికంటే 10శాతం అధికంగా పని చేయి
  • తెలియని విషయాలపై ఎప్పటికీ, ఎవ్వరితోనూ నీ అభిప్రాయం పంచుకోకు
  • ఎటువంటి స్థితిలో ఉన్నా మర్యాదగా ప్రవర్తించు. శ్రద్ధగా మెలుగు
  • ఎప్పుడూ ఫిర్యాదు చేయొద్దు. తీవ్రమైన విమర్శలనైనా ఎదుర్కో
  • మీకు వాస్తవం తెలిసినప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు.
  • అవసరమైన చోట లెక్కలు వేయడం నేర్చుకో
  • ఓపెన్‌ మైండెడ్‌గా ఉంటూ.. ప్రతీ విషయాన్ని ఓ కంట కనిపెడుతుండాలి
  • ఏ విషయంలోనైనా తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలి.

₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్‌ నుంచి రైలు

‘‘21 సంవత్సరాల వయసులో కాలేజీ నుంచి బయటకు వచ్చి మొదటి ఉద్యోగంలో చేరాల్సిన సమయంలో మా నాన్న చేతితో రాసిన ఈ టిప్స్‌ లిస్ట్‌ను ఇచ్చారు. నా విజయంలో ఈ అంశాలు కీలక భూమిక పోషించాయి. వీటినే నా పిల్లలకు అందించాను’’ అని రాండోల్ఫ్‌ పేర్కొన్నారు. తన తండ్రి చేతి రాతతో ఉన్న విషయాలకు సంబంధించిన నోట్‌ను కూడా పంచుకున్నారు. ఈ పోస్ట్‌పై పలువురు రాండోల్ఫ్‌ తండ్రిని కొనియాడుతున్నారు. ‘‘ఇవి నిజంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశాలు. ముఖ్యంగా ఉద్యోగంలో అడుగుపెట్టేముందు’’ అంటూ యూజర్లు తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని