Netflix: పాస్‌వర్డ్ షేరింగ్ ఇక కుదరదు.. ఇంతకీ నెట్‌ఫ్లిక్స్ ఎలా తెలుసుకుంటుంది?
Netflix Password Sharing: బయటి వ్యక్తులకు పాస్‌వర్డ్ షేర్ చేయకుండా నెట్‌ఫ్లిక్స్ కట్టడి చేయనుంది. అలా షేర్ చేసుకుంటే అదనపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ వేరే వ్యక్తులని నెట్‌ఫ్లిక్స్ ఎలా తెలుసుకుంటుంది?
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా తగ్గుముఖం పట్టింది.. థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయి.. కానీ ప్రజలకు ఓటీటీ (OTT)లపై అభిమానం ఏమాత్రం తగ్గడం లేదు. వివిధ రకాల ఓటీటీలను సబ్‌స్క్రైబ్ చేసుకుంటూ ఇంటిల్లిపాదీ వినోదం ఆస్వాదిస్తున్నారు. అయితే, ఒక అకౌంట్‌ను తీసుకొని వివిధ డివైజ్‌ల్లో లాగిన్ అవుతున్నారు. దీంతో సబ్‌స్క్రైబర్లు సంఖ్య తగ్గి ఆదాయాన్ని కోల్పోతున్నామని నెట్‌ఫ్లిక్స్ (Netflix) వంటి ఓటీటీ సంస్థలు వాపోతున్నాయి. అందుకే పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. ఇప్పటికే ఇతర దేశాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టింది. అయితే పాస్‌వర్డ్ షేరింగ్‌ని (Password Sharing) ఎలా ఆపగలుగుతుంది? ఇంట్లోని వ్యక్తులు కాకుండా వేరొకరు అకౌంట్‌ని వినియోగిస్తే ఎలా కనిపెడుతుంది? అనే సందేహం రావడం సర్వసాధారణం. దీనికి తాజాగా నెట్‌ఫ్లిక్స్ తమ వెబ్‌సైట్‌లో సమాధానమిచ్చింది.
ఎవరైతే నెట్‌ఫ్లిక్స్ చందా తీసుకుంటారో ఆ వ్యక్తి ఇంటి సభ్యులు మాత్రమే ఇకపై యాక్సెస్ పొందగలరు. వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వారు అకౌంట్‌ను వినియోగించుకోవాలంటే అదనంగా డబ్బు కట్టాల్సి ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వ్యక్తి పాస్‌వర్డ్‌తో.. వేరే చోట ఉన్న వ్యక్తి అకౌంట్‌ని వాడాలనుకుంటే వారు నాలుగు అంకెల వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ 15 నిమిషాల్లోపే ఎంటర్ చేయాలి. ఒకసారి వెరిఫికేషన్ పూర్తి చేసిన వ్యక్తి ఎక్కడున్నా ఏడురోజుల పాటు అకౌంట్‌ను యాక్సెస్ చేయొచ్చు. కుటుంబానికి చెందిన వారైనా, వేరే వ్యక్తులైనా ఇలా అకౌంట్‌ను వేరే చోట వాడొచ్చు.
అయితే, ఇక్కడే నెట్‌ఫ్లిక్స్ ఒక మెలిక పెట్టింది. ఎవరైతే వేరే చోటు నుంచి నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ వాడుతున్నారో.. వారు సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వ్యక్తి ఉండే ప్రాథమిక ప్రదేశంలో 31 రోజుల్లోపు ఒక్కసారైనా వైఫై నెట్‌వర్క్‌ను వినియోగించాలి. అప్పుడే దాన్ని నమ్మదగిన డివైజ్‌గా నెట్‌ఫ్లిక్స్ గుర్తిస్తుంది. ఒకవేళ బయటి వ్యక్తులైతే ఒకేచోటు నుంచి వైఫై వాడడం సాధ్యం కాదన్నది నెట్‌ఫ్లిక్స్ ఆలోచన. ఒకవేళ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వ్యక్తే.. వేరే ప్రాంతానికి వెళ్లినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అలాగే, నెట్‌ఫ్లిక్స్‌ను ఒకే సమయంలో ఎంత మంది వినియోగించుకోవచ్చనేది వారు ఎంచుకున్న ప్లాన్‌పై ఆధారపడి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ స్పష్టంచేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Sajjala: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఎవరో గుర్తించాం : సజ్జల
-
Ap-top-news News
Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
-
Politics News
Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు
-
Ap-top-news News
Justice Battu Devanand : జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ
-
Politics News
Ganta Srinivasa Rao: ఫైనల్స్‌లో వైకాపా ఉండదు