Nothing earbuds: 40 గంటల బ్యాటరీ లైఫ్‌తో నథింగ్‌ నుంచి 2 కొత్త ఇయర్‌బడ్స్‌

Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్‌తో నథింగ్‌ రెండు ఇయర్‌బడ్స్‌ను భారత్ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ప్రారంభ ధర ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్‌ అందించనున్నట్లు తెలిపింది. 

Published : 19 Apr 2024 00:16 IST

Nothing | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ నథింగ్‌ (Nothing) రెండు కొత్త ఇయర్‌బడ్స్‌ను భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. నథింగ్‌ ఇయర్‌ (Nothing Ear), నథింగ్‌ ఇయర్‌ ఏ (Nothing Ear a) పేరిట వీటిని ఆవిష్కరించింది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే ఈ ఇయర్‌బడ్స్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందించింది. 

నథింగ్‌ ఇయర్‌.. బ్లాక్‌, వైట్‌ రెండు రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ TWS ఇయర్‌బడ్స్‌లో 11mm డ్రైవర్స్‌ అమర్చారు. 45 డీబీ వరకు యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC), ఇంటెలిజెంట్‌ నాయిస్‌ క్యాన్సిలింగ్‌ సదుపాయం ఉంది. ఇందులో కేస్‌ను ఒకసారి ఫుల్‌ ఛార్జి చేస్తే 40.5 గంటల ప్లే బ్యాక్‌ టైమ్‌ ఇస్తాయి. ఒక్కో ఇయర్‌బడ్‌ సింగిల్‌ ఛార్జ్‌తో 8.5 గంటలు పని చేస్తాయి. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో పది గంటలు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 2.5W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేయడంతో పాటు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉందని తెలిపింది. ఇక కేస్‌ను 90 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జ్‌ చేయొచ్చు. ఇయర్‌బడ్స్‌ IP54 రేటింగ్‌తో, కేస్‌ IP55 రేటింగ్‌ను కలిగిఉంది.

ఇన్ఫీ లాభం 30 శాతం జంప్‌.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్‌

ఎల్లో, బ్లాక్‌, వైట్‌ రంగుల్లో లభిస్తున్న నథింగ్‌ ఇయర్‌ ఏ ధర రూ.7,999గా పేర్కొంది. అచ్చం నథింగ్‌ ఇయర్‌ మాదిరిగానే డిజైన్‌ ఉంటుంది. 45 డీబీ వరకు యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సదుపాయం ఉంది. దీనికి బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఇచ్చారు. క్యారీ కేస్‌ 500mAh బ్యాటరీ, ఇయర్‌బడ్స్‌లో 46mAh యూనిట్ ఇచ్చారు. క్విక్‌ ఛార్జ్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఇయర్‌బడ్స్‌ను ఒకసారి ఫుల్‌ ఛార్జి చేస్తే 42.5 గంటల ప్లే బ్యాక్‌ టైమ్‌ ఇస్తాయి. ఇవి వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేయవు. 10 నిమిషాల ఛార్జింగ్‌తో పది గంటలు పని చేస్తాయి. ఇయర్‌ బడ్స్‌ IP54, కేస్‌ IPX2 రేటింగ్  ఇచ్చారు. ప్రారంభ ఆఫర్‌ కింద కొనుగోలు చేసినవారికి నథింగ్‌ ఇయర్‌ను రూ.10,999, ఇయర్‌ ఏ ను రూ.5,999కే పొందొచ్చని తెలిపింది. ఏప్రిల్‌ 22 నుంచి విక్రయాలు మొదలవుతాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని