OnePlus 12R: స్టోరేజీపై తప్పుడు సమాచారం.. పూర్తి రిఫండ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌

OnePlus 12R: ఫోన్‌ లాంచింగ్‌ సమయంలో చేసిన తప్పుడు ప్రకటన కారణంగా ప్రముఖ మొబైల్‌తయారీ సంస్థ వన్‌ప్లస్‌ కీలక నిర్ణయం తీసుకొంది. స్మార్ట్‌ఫోన్‌ పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది.

Published : 19 Feb 2024 02:03 IST

OnePlus 12R | ఇంటర్నెట్‌డెస్క్‌: వన్‌ప్లస్‌ కొత్తగా లాంచ్‌ చేసిన 12ఆర్‌ (OnePlus 12R) మొబైల్‌ కొనుగోలు చేసిన వాళ్లకు పూర్తి డబ్బు తిరిగి ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్‌ స్టోరేజీ (UFS)పై తప్పుడు సమాచారాన్ని అందించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 16వరకు ఈ సదుపాయం ఉంటుందని కంపెనీ సీఓఓ ప్రకటించారు.

వన్‌ప్లస్ కంపెనీ గత నెలలో వన్‌ప్లస్ 12R (OnePlus 12R) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రెండు వేరియంట్లలో ఈ మొబైల్‌ని తీసుకొచ్చింది. అందులో 16 జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.45,999గా నిర్ణయించింది. స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 2 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో యూఎఫ్‌ఎస్‌ (Universal Flash Storage) 4.0 స్టోరేజీ కలిగి ఉంటుందని కంపెనీ లాంచింగ్ సమయంలో వెల్లడించింది. 

పేటీఎం ఉదంతంతో కంపెనీలకు నిబంధనల ప్రాముఖ్యత తెలిసొచ్చింది: రాజీవ్‌ చంద్రశేఖర్‌

తాజాగా ఈ విషయంపై వన్‌ప్లస్‌ ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. వన్‌ప్లస్‌ ఆర్‌ హై స్టోరేజీ వేరియంట్‌ ఫోన్లు నిజానికి UFS 3.1 స్టోరేజ్‌తో వచ్చాయని, లాంచింగ్ సమయంలో తప్పుగా ప్రకటించామని ధ్రువీకరించింది. వన్‌ప్లస్‌ ఆర్‌ 256జీబీ వేరియంట్‌ను కొనుగోలు చేసినవారికి పూర్తి మొత్తాన్ని రిఫండ్‌ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. వన్‌ప్లస్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని వన్‌ప్లస్‌ సీఓఓ కిండర్‌ లియు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని