OnePlus 12R: వన్‌ప్లస్‌ 12ఆర్‌లో కొత్త వేరియంట్‌.. ధర, ఫీచర్లివే..!

OnePlus 12R: జనవరిలో విడుదలైన వన్‌ప్లస్‌ 12ఆర్‌లో తాజాగా మరో కొత్త వేరియంట్‌ వచ్చింది. దాని ఫీచర్లు, ధర వివరాలను చూద్దాం..!

Published : 21 Mar 2024 15:12 IST

OnePlus 12R | ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్‌ప్లస్‌ 12ఆర్‌ జనవరిలో భారత్‌లోకి వచ్చింది. దీన్ని కంపెనీ రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో (OnePlus 12R) స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను అమర్చారు. సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఇచ్చారు. ఆండ్రాయిడ్‌-14తో వస్తున్న ఈ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను పొందుపర్చారు. ఫిబ్రవరిలో దీంట్లోనే గెన్‌షిన్‌ ఇంపాక్ట్‌ ఎడిషన్‌ కూడా విడుదలైన విషయం తెలిసిందే.

వన్‌ప్లస్‌ 12ఆర్‌ కొత్త వేరియంట్‌ ధర..

కొత్తగా వన్‌ప్లస్‌ 12ఆర్‌ (OnePlus 12R) 8జీబీ ర్యామ్, 256జీబీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.42,999. నేటినుంచి ఇది విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. దీన్ని కొనుగోలు చేసినవారిలో ఎంపిక చేసిన కస్టమర్లకు కంపెనీ వన్‌ప్లస్‌ బడ్స్‌ జెడ్‌2 ఇయర్‌ఫోన్స్‌ను ఉచితంగా ఇవ్వనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, వన్‌కార్డ్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఉంది. లాంఛ్‌ ఆఫర్‌ కింద రెడ్‌ కేబుల్‌ క్లబ్‌ ఆఫర్లను కూడా ఇస్తున్నారు. ఈ కొత్త వేరియంట్‌ ఒరిజినల్‌ కూల్‌ బ్లూ, ఐరన్‌ గ్రే రంగుల్లోనూ లభిస్తుంది. జనవరిలో వచ్చిన 8జీబీ + 128జీబీ ధర రూ.39,999గా, 16జీబీ + 256జీబీ ధర రూ.45,999గా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఎలక్ట్రో వయలెట్‌ షేడ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న గెన్‌షిన్‌ ఎడిషన్‌ 16జీబీ + 256జీబీ ధర రూ.49,999.

వన్‌ప్లస్ 12ఆర్‌లో గెన్‌షిన్‌ ఇంపాక్ట్‌ ఎడిషన్‌.. ధర ఫీచర్లివే..!

వన్‌ప్లస్‌ 12ఆర్‌ ఫీచర్లు..

ఈ ఫోన్‌లో (OnePlus 12R) 120Hz రీఫ్రెష్‌ రేటు, గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రొటెక్షన్‌తో ఎల్‌టీపీఓ 4.0 అమోలెడ్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాససర్‌ను పొందుపర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 14ను ఇచ్చారు. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో భాగంగా 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌890 ఓఐఎస్‌ ప్రైమరీ సెన్సర్‌, 8ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ సెన్సర్‌, 2ఎంపీ మైక్రో షూటర్‌ను అమర్చారు. సెల్ఫీల కోసం ముందుభాగంలో 16ఎంపీ కెమెరాను ఇచ్చారు. 100వాట్స్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. వైఫై, బ్లూటూత్‌ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు