OnePlus Nord CE 3: వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 ఫోన్‌పై డిస్కౌంట్‌.. ఈ సబ్‌స్క్రిప్షన్లూ ఉచితం!

OnePlus Nord CE 3: నార్డ్‌ సీఈ3 ధరను వన్‌ప్లస్‌ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..!

Updated : 23 Apr 2024 11:45 IST

OnePlus Nord CE 3 | వన్‌ప్లస్‌లో అందుబాటు ధరలో ఫోన్ కోసం చూస్తున్నారా? అలాంటి వారికి కంపెనీ ఓ గుడ్‌న్యూస్‌ తీసుకొచ్చింది. నార్డ్‌ సీఈ4ను విడుదల చేసిన నేపథ్యంలో నార్డ్‌ సీఈ3 (OnePlus Nord CE 3) ధరను కుదించింది. కంపెనీ ఆన్‌లైన్‌ స్టోర్‌ సహా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో కొత్త ధరను ఉంచింది.

ఇవీ రాయితీలు..

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 (OnePlus Nord CE 3) ఫోన్‌లో 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను కంపెనీ రూ.26,999కు గత ఏడాది జులైలో విడుదల చేసింది. ఇటీవల నార్డ్‌ సీఈ4ను తీసుకొచ్చిన నేపథ్యంలో దాన్ని రూ.4,000 తగ్గించి రూ.22,999కు కుదించింది. బ్యాంకు ఆఫర్లతో రేటు మరింత తగ్గుతుంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, వన్‌కార్డ్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 తక్షణ రాయితీ లభిస్తుంది. హెడ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ కార్డు ఈఎంఐ అయితే రూ.2,250 డిస్కౌంట్ పొందొచ్చు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3ని కనిష్ఠంగా రూ.20,749కు కొనుగోలు చేయొచ్చు.

గూగుల్‌ మ్యాప్స్‌లో మరో కొత్త ఫీచర్‌..ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!

అదనపు ప్రయోజనాలు..

ధరలో రాయితీతో పాటు వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 (OnePlus Nord CE 3) కొనుగోలు చేసేవారికి కంపెనీ మరికొన్ని ప్రయోజనాలూ కల్పిస్తోంది. నలుపు లేదా ఆక్వా గ్రీన్‌ రంగు ప్రొటెక్టివ్‌ కేస్‌ను ఉచితంగా ఇస్తోంది. ఆరు నెలల పాటు గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌, 3 నెలల వ్యాలిడిటీతో యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందొచ్చు.

నార్డ్‌ సీఈ3 ఫీచర్లు..

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 (OnePlus Nord CE 3) ఫోన్‌లో 120Hz రీఫ్రెష్‌ రేటుతో కూడిన అమోలెడ్‌ తెరను అమర్చారు. ఆక్వా సర్జ్‌, గ్రే షిమ్మర్‌ రంగుల్లో ఫోన్‌ అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 782జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 13.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఇచ్చారు. 80వాట్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. 15-20 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. వెనక ఓఐఎస్‌తో కూడిన 50 ఎంపీ ప్రధాన, 8ఎంపీ అల్ట్రావైడ్‌, 2ఎంపీ మైక్రో కెమెరా సెటప్‌ ఉంది. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని