OnePlus Nord CE 4: 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4.. ధర, ఫీచర్లు ఇవే!

OnePlus Nord CE 4 launched: వన్‌ప్లస్‌ సంస్థ నార్డ్‌ సీఈ 4 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. దీని ధర  రూ.24,999 నుంచి ప్రారంభం అవుతుంది.

Published : 02 Apr 2024 00:08 IST

OnePlus Nord CE 4 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (OnePlus) నార్డ్‌ సిరీస్‌లో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నార్డ్‌ సీఈ4 (OnePlus Nord CE 4) ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గతేడాది నార్డ్‌ సీఈ 3కి కొనసాగింపుగా వన్‌ప్లస్‌ దీన్ని తీసుకొచ్చింది. మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త ఫోన్‌ ధర ఎంత? ఫీచర్లు ఏంటి?

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 రెండు వేరియంట్ల్లలో లభిస్తుంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ రూ.26,999గా పేర్కొంది. డార్క్‌ క్రోమ్‌, సెలాడన్‌ మార్బుల్‌ రంగుల్లో లభిస్తుంది. వన్‌ప్లస్‌ ఆన్‌లైన్ స్టోర్‌, అమెజాన్‌ ఇండియా, ఇతర రిటైల్‌ స్టోర్లలో ఏప్రిల్‌ 4 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. నార్డ్‌ సీఈ4 కొనుగోలుపై వన్‌ప్లస్‌ నార్డ్‌ 2ఆర్‌ ఇయర్‌ బడ్స్‌ను ఉచితంగా అందించనున్నట్లు వన్‌ప్లస్‌ పేర్కొంది. 

ఇక స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ 14 ఓఎస్‌పై పనిచేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+   అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ అమర్చారు. వెనకవైపు 50 ఎంపీ సోనీ LYT600 సెన్సర్‌ను ఇచ్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్ట్‌తో వస్తోంది. 8 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 355 అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉంది. ముందువైపు   16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఇందులోని 5,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 100W సూపర్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లో   ఫుల్ బ్యాటరీని ఛార్జి చేయొచ్చని కంపెనీ చెబుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని