OpenAI: 15 సెకన్ల రికార్డింగ్‌తో మీ వాయిస్‌ క్లోన్‌.. ఓపెన్‌ఏఐ కొత్త టూల్‌

OpenAI: చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ వాయిస్‌ను క్లోన్ చేసే సాంకేతికతను ఆవిష్కరించింది.

Updated : 30 Mar 2024 16:55 IST

OpenAI | ఇంటర్నెట్‌డెస్క్‌: చాట్‌జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ఏఐ మరో సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. వ్యక్తి వాయిస్‌ను క్లోన్‌ చేయగలిగే వాయిస్‌ ఇంజిన్‌ సాంకేతికతను ఆవిష్కరించినట్లు చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) ప్రకటించారు. ఈ టూల్‌ ద్వారా కేవలం 15 సెకన్ల రికార్డింగ్‌తోనే వ్యక్తి వాయిస్‌ని పునః సృష్టించొచ్చని పేర్కొన్నారు. భద్రతా కారణాల రీత్యా ప్రస్తుతానికి పౌరులకు దీన్ని అందుబాటులోకి తీసుకురావడం లేదని స్పష్టం చేశారు.

వాయిస్‌ క్లోన్‌ అంటే.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో మనిషి వాయిస్‌ను రీక్రియేట్‌ చేయడం. ప్రస్తుతానికి దీన్ని పరీక్షించనున్నామని ఆల్ట్‌మన్‌ పేర్కొన్నారు. ‘‘వ్యక్తుల ప్రసంగాలను క్లోన్ చేసి మళ్లీ సృష్టించడం వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రమాదాలకు మరింత ఆస్కారం ఉంటుంది. అందుకే కొత్త సాంకేతికత దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోం’’ అని శామ్‌ ఆల్ట్‌మన్‌ పేర్కొన్నారు.

తిరుమల ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు ఇవే..

ఇటీవల బైడెన్‌ను అనుకరిస్తూ ఏఐ సాయంతో రూపొందిన వాయిస్‌ వైరల్‌ అయిన విషయం తెలిసిందే. న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన డెమోక్రాట్‌ ప్రైమరీ ఎన్నికల సమయంలో ఇవి వెలుగులోకి వచ్చాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేయొద్దని బైడెన్‌ చెప్పినట్లు అందులో ఉండడం కలకలం సృష్టించింది. ఈ ఏడాది భారత్‌, అమెరికాలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మరోవైపు పలు స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే వాయిస్-క్లోనింగ్ టెక్నాలజీని అందిస్తున్నాయి. వాటిలో కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియో వంటి ఎంపిక చేసిన వ్యాపార కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు