Oppo: 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో ఒప్పో F25 ప్రో

Oppo F25 Pro 5G: ఒప్పో తన ‘ఎఫ్‌’ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఈ మొబైల్ ధర, ఫీచర్ల వివరాలు చూద్దాం.

Updated : 29 Feb 2024 18:52 IST

Oppo F25 Pro 5G | ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ‘ఎఫ్‌’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఎఫ్‌25 ప్రో 5జీ (Oppo F25 Pro 5G) పేరుతో మొబైల్‌ని భారత్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. పాండా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. ఈ ఫోన్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

ఒప్పో కొత్త ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.23,999గా, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.28,999గా కంపెనీ నిర్ణయించింది. లావా రెడ్‌, ఓషన్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. మార్చి 5 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఒప్పో ఇ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రిటైల్‌ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ ప్రకటించింది.

నా బలం, బలగం వాళ్లే..!: ఆకాశ్‌, ఈశా గురించి అనంత్‌ అంబానీ

ఆండ్రాయిడ్‌ ఆధారిత కలర్‌ ఓఎస్‌ 14.0తో పనిచేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ (MediaTek Dimensity) 7050 ప్రాసెసర్‌ అమర్చారు. ట్రిపుల్‌ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది. వెనకభాగంలో 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ సోనీ IMX355 వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌, 2 ఎంపీ మ్యాక్రో సెన్సార్‌ ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 32 ఎంపీ కెమెరా అమర్చారు. ఫోన్‌లో ఇరువైపులా ఉన్న కెమెరాలు 4కె వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్‌ చేస్తాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్‌ సాయంతో స్టోరేజీ పెంచుకొనే సదుపాయం ఉంది. యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, 5జీ, వైఫై 6, బ్లూటూత్‌, జీపీఎస్‌ కనెక్టివిటీ ఉన్నాయి. 5,000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 10 నిమిషాల్లో 30 శాతం ఛార్జ్‌ అవుతుందని ఒప్పో పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని