Poco c61: పోకో నుంచి ఎంట్రీ లెవల్‌ ఫోన్‌.. ఫీచర్లు ఇవే..

Poco C61: పోకో తన ‘‘సీ’’ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మార్చి 28 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది.

Published : 26 Mar 2024 17:16 IST

Poco C61 | ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ పోకో ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. పోకో సీ61 (Poco C61) పేరిట దీన్ని తీసుకొచ్చింది. పోకో కొత్త ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.6,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.7,999గా పేర్కొంది. డైమండ్‌ డస్ట్‌ బ్లాక్‌, ఎథెరియల్‌ బ్లూ, మిస్టికల్‌ గ్రీన్‌.. రంగుల్లో లభిస్తుంది. మార్చి 28 మధ్యాహ్నం 12 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది.

టిక్‌టాక్‌పై నిషేధం ముప్పు.. అమెరికాలో బైట్‌ డ్యాన్స్‌ ‘కొత్త’ ప్లాన్‌!

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 6.71 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ కలిగి ఉంటుంది. 90Hz రిఫ్రెష్‌ రేటు, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేటు ఇస్తున్నారు. గొరిల్లా గ్లాస్‌3 ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14కి సపోర్ట్‌ చేస్తుంది. మీడియాటెక్‌ హీలియో జీ36 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫొటోల కోసం వెనకవైపు 8ఎంపీ ఏఐ బ్యాక్డ్‌ డ్యుయల్‌ రియర్‌ కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 5ఎంపీ సెన్సర్‌ ఇచ్చారు. 5,000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌ 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. డ్యుయల్‌ సిమ్‌, 4జీ, వైఫై, బ్లూటూత్‌ 5.4, జీపీఎస్‌, 3.5 ఎమ్‌ఎమ్ ఆడియో జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు