Realme 5G Sale: రియల్‌మీ సేల్‌ ప్రారంభం.. 5జీ స్మార్ట్‌ఫోన్లపై రాయితీలు

Realme 5G Sale: రియల్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్లపై కంపెనీ రాయితీలు, ఆఫర్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుతం ప్రత్యేక సేల్‌ ప్రారంభమైంది.

Published : 12 Sep 2023 12:27 IST

Realme 5G Sale | ఇంటర్నెట్‌ డెస్క్‌: రియల్‌మీ 5జీ సేల్‌ (Realme 5G Sale) ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 17 వరకు ఇది కొనసాగనుంది. వివిధ 5జీ స్మార్ట్‌ఫోన్ల (Realme 5G smartphones)పై రాయితీలు, ఆఫర్లు ఉన్నాయి. ఇటీవల లాంచ్‌ చేసిన నార్జో 60x, రియల్‌మీ 11 5జీ, రియల్‌మీ 11 ప్రో 5జీ సహా పలు ఫోన్లపై ఆఫర్లు లభించనున్నాయి. ఈ సేల్‌లో 5జీ ఫోన్‌ కొనుగోలు చేసిన వారు గరిష్ఠంగా రూ.12,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం రియల్‌మీ వెబ్‌సైట్‌లో ఈ సేల్‌ అందుబాటులో ఉంది. కొత్తగా విడుదల చేసిన రియల్‌మీ నార్జో 60x 5జీ (Realme Narzo 60x 5G) ఫోన్‌ఫై రూ.1,000 తక్షణ రాయితీ లభిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ ఫోన్‌ విక్రయానికి అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. రాయితీ తర్వాత ఫోన్‌ రూ.11,999కి లభించనుంది. అదనంగా రూ.279 విలువ చేసే కాయిన్స్‌ రివార్డుగా వస్తాయి. ఆరు నెలల పాటు స్క్రీన్‌ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ కూడా ఉంది. 4GB + 128GB, 6GB + 128GB వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను స్టెల్లార్‌ గ్రీన్‌, నెబ్యులా పర్పుల్‌ రంగుల్లో పొందొచ్చు.

రియల్‌మీ నుంచి నార్జో 60x, కొత్త ఇయర్‌ బడ్స్‌..పూర్తి వివరాలివే..

రియల్‌మీ 11 సిరీస్‌ (Realme 11 series)లో రియల్‌మీ 11 5జీ, 11 ప్రో, 11 ప్రో+ కూడా రాయితీ ధరకు లభిస్తున్నాయని కంపెనీ తెలిపింది. రియల్‌మీ 11 5జీపై రూ.1,500; 11 ప్రో, 11 ప్రో+పై రూ.2,000 వరకు తగ్గింపు లభించనుంది. అలాగే అన్ని రకాల 5జీ ఫోన్లపై నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఉందని రియల్‌మీ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. రియల్‌మీ 11x 5జీ ఫోన్‌పై కూడా నో-కాస్ట్‌ ఈఎంఐ అందుబాటులో ఉంది. అయితే, ప్రత్యేకంగా ధరలో మాత్రం ఎలాంటి రాయితీ లేదు. 6GB + 128GB, 8GB + 128GB వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ.14,999, రూ.15,999.

వీటితో పాటు రియల్‌మీ నార్జో 60 5జీపై రూ.1,300, నార్జో 60 ప్రో 5జీపై రూ.2,000 వరకు రాయితీ అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్‌ కార్డుల ద్వారా లావాదేవీలు చేసేవారికి అదనంగా రూ.250 తగ్గింపు కూడా ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు