Realme: రియల్‌మీ నుంచి నార్జో 60x, కొత్త ఇయర్‌ బడ్స్‌.. పూర్తి వివరాలివే..

Realme narzo 60x: రియల్‌మీ సంస్థ నార్జో 60ఎక్స్‌ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. దీంతో పాటు ఇయర్‌ బడ్స్‌ను సైతం లాంచ్‌ చేసింది.

Published : 06 Sep 2023 14:00 IST

Realme narzo 60x details: ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. రియల్‌మీ నార్జో 60 సిరీస్‌లో 60ఎక్స్‌  (Realme narzo 60x) పేరిట కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. 50 ఎంపీ కెమెరా, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి సదుపాయాలతో ఈ ఫోన్‌ వస్తోంది. దీంతో పాటు రియల్‌మీ T300 పేరిట టీడబ్ల్యూఎస్‌ బడ్స్‌ను కూడా లాంచ్‌ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రియల్‌మీ నార్జో 60ఎక్స్‌ 5జీ  (Realme narzo 60x) స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.14,499గా పేర్కొంది. అమెజాన్‌, రియల్‌మీ వెబ్‌సైట్లలో లభించనుంది. ప్రారంభ ఆఫర్‌ కింద వెయ్యి రూపాయలు డిస్కౌంట్‌ ఇస్తున్నారు. సెప్టెంబర్‌ 15 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 12న ఫ్లాష్‌ సేల్‌ నిర్వహించనున్నారు. నెబులా పర్పుల్‌, స్టెల్లర్‌ గ్రీన్‌ రంగుల్లో ఈ ఫోన్లు లభించనున్నాయి.

6,000mAh బ్యాటరీ..50MP కెమెరాతో మోటో జీ54 5జీ ఫోన్‌

రియల్‌మీ నార్జో 60ఎక్స్‌ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 680 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. డ్యూయల్‌ నానో సిమ్‌ ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌ మీ 4.0తో వస్తోంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డిమెన్‌ సిటీ 6100+ ప్రాసెసర్‌ అమర్చారు. వర్చువల్‌ ర్యామ్‌ సదుపాయం ద్వారా 12 జీబీ వరకు ర్యామ్‌ పెంచుకోవచ్చు. వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, సెల్ఫీల కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా వినియోగించారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33W సూపర్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.

రియల్‌మీ బడ్స్‌ టీ300

రియల్‌మీ 60 ఎక్స్‌తో పాటు రియల్‌మీ టీ300 (Realme buds t300) పేరిట ఇయర్‌బడ్స్‌ను సైతం లాంచ్‌ చేసింది. ఇందులో 2.4 ఎంఎం డైనమిక్‌ బేస్‌ డ్రైవర్‌, 30dB యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో వస్తోంది. 4 మైక్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ సదుపాయం కూడా ఉంది. 480 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీని ద్వారా 40 గంటలపాటు ఇయర్‌బడ్స్‌ను వినియోగించుకోవచ్చు. 1.5 గంటల్లో కేస్‌ను ఫుల్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చు. దీని ధరను రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 12 నుంచి సేల్‌కు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని