Realme GT 6T: భారత్‌లోకి రియల్‌ మీ జీటీ 6టీ ఫోన్‌.. 10 నిమిషాల్లో 50% ఛార్జ్‌!

Realme GT 6T: 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌టీపీవో ఎంఓలెడ్‌ తెరతో రియల్‌ మీ జీటీ 6టీ ఫోన్‌ విడుదలైంది. 120W ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఈ ఫోన్ ప్రత్యేకత.

Published : 22 May 2024 15:10 IST

Realme GT 6T | రియల్‌మీ జీటీ 6టీ ఫోన్‌ భారత్‌లో విడుదలైంది. దేశంలో క్వాల్‌కామ్‌ 4ఎన్‌ఎం స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 3 ప్రాసెసర్‌తో వచ్చిన తొలి ఫోన్‌ ఇదే. గరిష్ఠంగా 12జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. ఇతర ఫీచర్లు, ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

రియల్‌మీ జీటీ 6టీ ఫీచర్లు..

నానోడ్యూయల్‌ సిమ్‌తో వస్తోన్న రియల్‌మీ జీటీ 6టీ (Realme GT 6T) ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత యూఐ 5 ఓఎస్‌తో పనిచేస్తుంది. మూడు ఓఎస్‌ అప్‌డేట్లు, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇవ్వనున్నారు. 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌టీపీవో ఎమ్‌ఓ లెడ్‌ తెరను పొందుపర్చారు. 120Hz రీఫ్రెష్‌ రేటు, 6,000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ అందిస్తుందని కంపెనీ తెలిపింది. వెనక ఓఐఎస్‌ సపోర్ట్‌, ఎఫ్‌/1.88 అపెర్చర్‌, సోనీ ఎల్‌వైటీ-600 సెన్సర్‌తో కూడిన 50MP కెమెరాను పొందుపర్చారు. సెల్ఫీల కోసం సోనీ ఐఎంఎక్స్‌615 సెన్సర్‌తో కూడిన 32MP కెమెరా ఇచ్చారు. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్‌ 5.4, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 120W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని ఇచ్చారు. పది నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. ఫ్లుయిడ్‌ సిల్వర్‌, రేజర్‌ గ్రీన్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.

పిక్సెల్‌ ఫోన్లూ ఇక దేశీయంగానే.. డిక్సన్‌తో గూగుల్‌ జట్టు

Realme GT 6T ధర..

  • 8GB+128GB - రూ.30,999
  • 8GB+256GB - రూ.32,999
  • 12GB+256GB - రూ.35,999
  • 12GB+512GB - రూ.39,999

కంపెనీ ఆన్‌లైన్‌ స్టోర్‌ సహా అమెజాన్‌లో మే 29 మధ్యాహ్నం నుంచి ఈ ఫోన్‌ (Realme GT 6T) విక్రయాలు ప్రారంభమవుతాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డులతో రూ.4,000 రాయితీ పొందొచ్చు. రూ.2,000 ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ కూడా ఉంది. ఇవన్నీ కలిపితే ఫోన్‌ ధర రూ.6,000 వరకు తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు