Moto G54 5G: 6,000mAh బ్యాటరీ..50MP కెమెరాతో మోటో జీ54 5జీ ఫోన్‌

Moto G54 5G : మోటో జీ54 5జీ ఫోన్‌ ఈరోజు భారత్‌లో విడుదలైంది. దీంట్లో 12GB + 256GB వేరియంట్‌ టాప్‌- ఎండ్‌ మోడల్‌.

Published : 06 Sep 2023 13:28 IST

Moto G54 5G | మోటో ‘జీ’ సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ విడుదలైంది. మోటో జీ54 (Moto G54 5G) పేరిట వస్తున్న ఈ ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను ఇస్తున్నారు. 12GB ర్యామ్‌, గరిష్ఠంగా 256GB వరకు స్టోరేజ్‌ ఉంది.

మోటో జీ54 ధర (Moto G54 5G Price)..

బేస్‌ మోడల్‌ 8GB RAM + 128GB వేరియంట్‌ ధర రూ.15,999. టాప్‌-ఎండ్‌ మోడల్‌ 12GB RAM + 256GB ధర రూ.18,999. మిడ్‌నైట్‌ బ్లూ, మింట్‌ గ్రీన్‌, పర్ల్‌ బ్లూ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ సెప్టెంబరు 13 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానుంది. లాంఛ్‌ ఆఫర్‌ కింద ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.1,000 రాయితీ లభించనున్నట్లు కంపెనీ తెలిపింది. రూ.668 నుంచి ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

మోటో జీ54 ఫీచర్లు (Moto G54 5G Features)...

డ్యుయల్‌ సిమ్‌ నానో స్లాట్స్‌తో వస్తున్న ఈ మోటో G54 5G ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 My UI 5.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ తెర ఉంది. దీని రీఫ్రెష్‌ రేటు 120Hz. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌ను పొందుపర్చారు. వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా; సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం 16MP సెల్ఫీ కెమెరా ఉంది. గరిష్ఠంగా 256GB వరకు వస్తోన్న ఈ ఫోన్‌ స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు.

వైఫై, బ్లూటూత్‌, జీపీఎస్‌, ఏ-జీపీఎస్‌, GLONASS, యూఎస్‌బీ టైప్‌-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ ఉంది. ఫోన్‌కి సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ ఉంది. డాల్బీ అట్మోస్‌ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. దీంట్లో 33W టర్బోపవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉండడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని