Realme P1, p1 Pro: మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో రియల్‌మీ P సిరీస్‌ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!

రియల్‌మీ సంస్థ పి సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

Published : 15 Apr 2024 15:03 IST

Realme | ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme) ‘పి’ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను లాంచ్‌ చేసింది. పి1 5జీ, పి1 ప్రో 5జీ (Realme P1, p1 Pro) పేరిట వీటిని తీసుకొచ్చింది. మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ 5జీ ఫోన్ల ఫీచర్లేంటి? ధరెంత? విక్రయాలు ఎప్పటినుంచి?

రియల్‌మీ పీ1 5జీ రెండు వేరియంట్లలో వస్తుంది. 6జీబీ+ 128 జీబీ వేరియంట్‌ ధర రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+ 256జీబీ వేరియంట్‌ రూ.18,999గా పేర్కొంది. ఇక రియల్‌మీ పీ1 ప్రో సైతం రెండు వేరియంట్లలో వస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ రూ.21,999, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.22,999గా కంపెనీ పేర్కొంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఏప్రిల్ 30 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 

Dry Promotion: డ్రై ప్రమోషన్‌.. జాబ్‌ మార్కెట్‌లో ఇదో కొత్త ట్రెండ్‌

ఇక స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇంచుమించు రెండింట్లోనూ ఒకేతరహా ఫీచర్లు ఉన్నాయి. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేటు, 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ ఫోన్లలో ఉంటుంది. పీ1లో డైమెన్‌సిటీ 7050 ప్రాసెసర్‌ ఇచ్చారు. ప్రో మోడల్‌.. స్నాప్‌డ్రాగన్‌ 6 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌తో వస్తోంది. వెనకవైపు 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 600 కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా ఉంది. ప్రో వెర్షన్‌లో 8 ఎంపీ పోర్ట్ట్రెయిట్‌ కెమెరా అదనంగా ఉంటుంది. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తోంది. రెండేళ్లపాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది.

రియల్‌మీ ప్యాడ్

పి సిరీస్‌ ఫోన్లతోపాటే రియల్‌మీ ప్యాడ్‌ 2ను కూడా లాంచ్ చేశారు. ఇది 6జీబీ+128 జీబీ వేరియంట్‌లో లభిస్తుంది. 11.5 అంగుళాల 2కె ఐపీఎస్‌ స్క్రీన్‌, మీడియా టెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 13తో ఈ ట్యాబ్‌ పని చేస్తుంది. ఇది వైఫై మోడల్‌. దీని ధరను రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. ఆఫర్‌ అనంతరం రూ.15,999కే వస్తుంది. రియల్‌మీ బడ్స్‌ టీ110 కూడా లాంచ్‌ చేశారు. దీని ధర రూ.1,499గా నిర్ణయించారు. ఆఫర్ కింద రూ.1,299కే లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని