Redmi 12 5G: ₹ 11 వేలకే రెడ్‌మీ 5జీ ఫోన్.. ఫీచర్లివే

ఎంఐ (Mi) కంపెనీ రెడ్‌మీ (Redmi) బ్రాండ్‌లో ఓ కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతోపాటు రెడ్‌మీ స్మార్ట్‌వాచ్‌, షావోమి (Xiaomi) స్మార్ట్‌ టీవీలను కూడా తీసుకొచ్చింది. 

Published : 01 Aug 2023 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బడ్జెట్‌ ఫ్రెండ్లీ బ్రాండ్‌గా పేరున్న రెడ్‌మీ (Redmi).. మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ 12 (Redmi 12) పేరుతో పరిచయం చేసిన ఈ ఫోన్‌ను 4G, 5G వేరియంట్లలో తీసుకొచ్చింది. దీంతోపాటు రెడ్‌మీ వాచ్‌ 3 (Redmi Watch 3), షావోమి స్మార్ట్‌ టీవీ ( Xiaomi Smart TV)లను కూడా కంపెనీ విడుదల చేసింది. వీటి ధర, ఫీచర్ల వివరాలివే...

రెడ్‌మీ 12 ఫీచర్లు

ఈ ఫోన్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌తో 6.79-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎమ్‌ఐయూఐ 14 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 4G వేరియంట్‌లో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌ను, 5G వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌ను వాడారు. ఇది 8 రకాల 5G బ్యాండ్‌విడ్త్‌లను సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 22.5 వాట్ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఐపీఎస్స్ 53 వాటర్‌ రెసిస్టెన్స్, సైడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ వంటి ఫీచర్లున్నాయి. 

4G వేరియంట్‌లో 4 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 8,999. 6 జీబీ/ 128 జీబీ ధర రూ. 10,999. 5G వేరియంట్‌ 4 జీబీ/128 జీబీ ధర రూ. 10,999 కాగా, 6 జీబీ/128 జీబీ ధర రూ. 12,499, 8 జీబీ/ 256 జీబీ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. ఆగస్టు 4 నుంచి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లతోపాటు షావోమి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. 

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. ఈ కార్డులపై 10% డిస్కౌంట్‌


రెడ్‌మీ వాచ్‌ 3

ఈ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్‌తోపాటు 24/7 హెల్త్‌ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. మెటాలిక్‌ డయల్‌, 60 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 1.83-అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. 100 స్మార్ట్‌వాచ్‌ ఫేస్‌లతోపాటు, ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌, మెన్‌స్ట్రువల్‌ మానిటరింగ్, స్ట్రెస్‌ క్యాలిక్యులేటర్‌, హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌, స్లీప్‌ ట్రాకింగ్, 5 ఏటీఎమ్‌ వాటర్‌ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లున్నాయి. 289 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 12 రోజులపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ వాచ్‌ ధర రూ. 2,999. 


షావోమి స్మార్ట్‌టీవీ

4K అల్ట్రా హెచ్‌డీ, డాల్బీ విజన్‌ డిస్‌ప్లేతో నాలుగు స్క్రీన్‌ సైజుల్లో షావోమి ఎక్స్‌ సిరీస్‌ స్మార్ట్‌ టీవీని విడుదల చేసింది. 43- అంగుళాల టీవీ ధర రూ. 26,999| 50-అంగుళాల టీవీ ధర రూ. 32,999| 55-అంగుళాల టీవీ ధర రూ. 37,999| 65-అంగుళాల టీవీ ధర రూ. 58,999గా కంపెనీ నిర్ణయించింది. వివిడ్‌ పిక్చర్‌ ఇంజిన్‌ , 30 వాట్‌ డాల్బీ స్పీకర్స్, ఇన్‌-బిల్ట్‌ క్రోమ్‌కాస్ట్‌, గూగుల్‌ టీవీ వంటి పీచర్లు ఉన్నాయి. ఆగస్టు 4 నుంచి షావోమి, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని