Redmi: ₹10 వేలకే రెడ్‌మీ 5జీ ఫోన్‌.. రెడ్‌మీ 13సీ ఫీచర్లు ఇవే..!

Redmi: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ రెడ్‌మీ తన సి సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఈ రెండు ఫోన్లను మూడు వేరియంట్లలో తీసుకొచ్చినట్లు పేర్కొంది.

Updated : 06 Dec 2023 17:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా మొబైల్ తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన ‘సీ’ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ల (Smartphones)ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రెడ్‌మీ 13సీ (Redmi 13C), రెడ్‌మీ 13సీ 5జీ (Redmi 13C 5G) పేరుతో రెండు ఫోన్లను విడుదల చేసింది. 4జీ, 5జీ వేరియంట్లలో ఈ ఫోన్లను తీసుకొచ్చింది. 5,000mAh బ్యాటరీ, ట్రిపుల్‌ కెమెరాతో ఈ ఫోన్లు వస్తున్నాయి. ఫోన్ల ఫీచర్లు, ధర వివరాలు ఇవీ..

ధరలివే..

రెడ్‌మీ 13సీ 5జీ (Redmi 13C 5G) మూడు వేరియంట్లలో లభిస్తుంది. లాంచింగ్‌ ప్రైస్‌లో (బ్యాంక్‌ ఆఫర్‌తో కలుపుకొని) భాగంగా బేస్‌ వేరియంట్‌ 4జీబీ+ 128జీబీ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.11,499గా కంపెనీ నిర్ణయించింది. ఇక 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.13,499గా పేర్కొంది. స్టార్‌ట్రైల్‌ బ్లాక్‌, స్టార్‌ట్రైల్‌ సిల్వర్‌, స్టార్‌ట్రైల్‌ గ్రీన్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. రెడ్‌మీ 13సీ (Redmi 13C) కూడా మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.8,999 కాగా.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.10,499గా రెడ్‌మీ పేర్కొంది. స్టార్‌డస్ట్‌ బ్లాక్‌, స్టార్ షైన్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

జనవరి 1 నుంచి సిమ్‌ కార్డుల జారీకి కొత్త రూల్‌

రెడ్‌మీ 13సీ 5జీ ఫీచర్లు..

రెడ్‌మీ 13సీ మొబైల్‌ 6.74 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో పనిచేస్తుంది. ట్రిపుల్‌ స్లాట్‌ సిమ్‌ కార్డ్‌ ట్రేని కలిగి ఉంటుంది. అంటే రెండు నానో సిమ్‌లతో పాటు అదనంగా ఎస్‌డీ కార్డు యాడ్‌ చేసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ ఫోన్‌ ట్రిపుల్‌ కెమెరాతో వస్తోంది. ఫోన్‌ వెనక 50 ఎంపీ ప్రధాన కెమెరా, సెల్ఫీ కోసం ముందువైపు 5 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్‌ పెంచుకోవచ్చు. 5,000mAh బ్యాటరీ, 10W ఫాస్ట్‌ ఛార్జర్‌తో ఈ ఫోన్‌ లభిస్తుంది.

ఇక రెడ్‌మీ 13సీ 4జీ వేరియంట్‌ కూడా 6.74 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో పనిచేస్తుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ అమర్చారు. మిగిలనవన్నీ 5జీ వేరియంట్‌లో ఉన్న ఫీచర్లే ఇందులోనూ ఉన్నాయి. డిసెంబరు 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి రెడ్‌మీ 13సీ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రెడ్‌మీ 13సీ 5జీ ఫోన్‌ డిసెంబర్‌ 16 నుంచి అందుబాటులోకి రానుంది. రెడ్‌మీ వెబ్‌సైట్‌, షావోమీ రిటైల్‌ స్టోర్లతో పాటు అమెజాన్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి రూ.1,000 డిస్కౌంట్‌ అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని