జియోకు 30 లక్షల కొత్త సబ్‌స్క్రైబర్లు.. VI నుంచి కొనసాగుతున్న వలసలు

mobile users: ఏప్రిల్‌ నెలకు గాను టెలికాం రంగానికి సంబంధించి సబ్‌స్రైబర్ల డేటాను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసింది. కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోవడంలో ఎప్పటిలానే జియో ముందువరుసలో నిలిచింది.

Published : 29 Jun 2023 15:49 IST

దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) కొత్త యూజర్లను ఆకట్టుకోవడంలో ముందు వరుసలో నిలిచింది. ఎప్పటిలాగానే టెలికాం రంగంలో తన పట్టును కొనసాగిస్తోంది. ఏప్రిల్‌ నెలలో కొత్తగా 30.4 లక్షల మందిని తన నెట్‌వర్క్‌లోకి చేర్చుకుంది. భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) కూడా 76,328 మంది తన నెట్‌వర్క్‌లోకి ఆహ్వానించింది. అదే సమయంలో వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) మాత్రం 29.9 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఈ మేరకు ఏప్రిల్‌ నెలకు సంబంధించిన గణాంకాలను టెలికాం నియంత్రిణ సంస్థ ట్రాయ్‌ (TRAI) విడుదల చేసింది.

టెలికాం రంగంలో ప్రైవేటు రంగం హవా కొనసాగుతోంది. మొత్తం టెలికాం మార్కెట్లో వీటి వాటానే 90 శాతం ఉంది. ఈ విషయంలో 37.9 శాతంతో రియన్స్‌ జియో అగ్రస్థానంలో నిలిచింది. ఎయిర్‌టెల్‌ (32.4 శాతం), వొడాఫోన్‌ (20.4 శాతం) రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. వొడాఫోన్‌ ఐడియా కంపెనీకు సబ్‌స్క్రైబర్లు తగ్గిపోవడంతో తన మార్కెట్ వాటాను వేగంగా కోల్పోతోంది. ఇక ప్రభుత్వరంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌ మార్కెట్‌ వాటా 9.2 శాతానికి పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని