Jio Prepaid Plan: జియో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌.. ఓటీటీ సదుపాయంతో

Jio Prepaid Plan: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ యూజర్ల కోసం కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ తీసుకొచ్చింది. ఇందులో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా జతచేసింది.

Published : 07 Dec 2023 17:32 IST

Jio prepaid plan | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్నాళ్లు డేటా, అపరిమిత కాల్స్‌కు మాత్రమే పరిమితమైన జియో ఇప్పుడు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌నూ తీసుకొస్తోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన అనేక ప్లాన్లను యూజర్లకు పరిచయం చేసింది. తాజాగా మరో రెండు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ (Jio Prepaid Plan) ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీ, ఓటీటీ సదుపాయంతో ఈ ప్లాన్‌ తీసుకొచ్చింది.

జియో తీసుకొచ్చిన కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.909తో రీఛార్జ్‌ చేసుకుంటే 84 రోజుల పాటూ రోజుకి 2 జీబీ డేటా పొందొచ్చు. అంటే 84 రోజులకు గానూ మొత్తం 168 జీబీ వినియోగించుకోవచ్చు. అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌కు సోనీలివ్‌, జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. దీంతో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌ యాక్సెస్‌ కూడా పొందొచ్చు.

బడ్జెట్‌లో ‘అద్భుతాలు’ ఉండకపోవచ్చు: నిర్మల సీతారామన్‌

నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో రూ.1,099, రూ.1,499 రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. జియో రూ.1,099 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. 84 రోజలు వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు. 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన రూ.1,499 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 3జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ఈ రెండు ప్లాన్లతో జియో యాప్స్‌ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందిస్తోంది. ఇక, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ కోసం రూ.3,227 రీఛార్జ్‌ ప్లాన్‌ తీసుకొచ్చింది. ఏడాది కాల పరిమితితో వచ్చే ఈ ప్లాన్‌తో మొత్తం 730 జీబీ డేటా లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని