₹10వేల బడ్జెట్‌లో శాంసంగ్ కొత్త ఫోన్‌.. ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయంతో!

Samsung Galaxy A05:  ప్రముఖ టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ తాజాగా గెలాక్సీ ఏ05 పేరుతో కొత్త మొబైల్‌ని లాంచ్‌ చేసింది. ప్రారంభ ఆఫర్‌లో కొనుగోలు చేసే వారికి రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది.

Published : 28 Nov 2023 14:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ (Samsung) తన ‘ఏ’ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గెలాక్సీ ఏ05 (Samsung Galaxy A05 ) పేరిట ఈ మొబైల్‌ని విడుదల చేసింది. మొబైల్‌ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో రానున్న ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

గెలాక్సీ ఏ05 (Samsung Galaxy A05 ) ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.12,499గా పేర్కొంది. బ్లాక్‌, లైట్‌ గ్రీన్‌, సిల్వర్‌ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీ పీఎల్‌ఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత వన్‌ యూఐ స్కిన్‌తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ అమర్చారు. అదనంగా 6జీబీ మెమోరీని జోడించే సుదపాయాన్ని కల్పించారు. ఫోన్‌ వెనక 50ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ కెమెరాను అమర్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డుకట్ట.. తొలి UPI చెల్లింపునకు 4 గంటల వ్యవధి?

శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లతో పాటూ అన్ని రిటైల్‌ దుకాణాల్లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే ప్రారంభ ఆఫర్‌ కింద రూ.1,000 క్యాష్‌బ్యాక్‌ని కూడా అందించనుంది. శాంసంగ్‌ ఫైనాన్స్‌+ ద్వారా కొనుగోలు చేస్తే నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం పొందొచ్చని కంపెనీ పేర్కొంది. వీటికి అదనంగా నెలకు రూ.875 నుంచి ఈఎంఐ సదుపాయాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు