Samsung Galaxy F55: లెదర్‌ ఫినిష్‌తో శాంసంగ్‌ ఎఫ్‌55.. లాంచ్‌ ఆఫర్లు ఇవే..

Samsung Galaxy F55 : శాంసంగ్‌ కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఎఫ్‌55 పేరిట 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో వీటి అమ్మకాలు జరుగుతాయి.

Published : 27 May 2024 13:38 IST

Samsung Galaxy F55 5g | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ (samsung) కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తన ఎఫ్‌ సిరీస్‌ ఎఫ్‌55 5జీని (Samsung Galaxy F55) తీసుకొచ్చింది. లెదర్‌ ఫినిష్‌తో ఈ ఫోన్‌ తీసుకురావడం గమనార్హం. ఎన్‌ఎఫ్‌సీ, ముందూ వెనుక 50 ఎంపీ కెమెరాలు ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణలు. ఈ ఫోన్‌ ధర, ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..

శాంసంగ్‌ ఎఫ్‌ 55 మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ బేస్‌ వేరియంట్‌ ధరను రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.29,999, 12జీబీ+ 256జీబీ వేరియంట్‌ రూ.32,999గా కంపెనీ నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌లో నేటి నుంచే అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోళ్లపై రూ.2వేలు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు లాంచ్‌ ఆఫర్‌ కింద 31వ తేదీలోపు కొనుగోలు చేసే వారికి 45W అడాప్టర్‌ను రూ.499కే విక్రయించనున్నారు. లేదంటే ఫిట్‌3 స్మార్ట్‌వాచ్‌ను రూ.1999కే కొనుగోలు చేయొచ్చు.

అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వీఐ కొత్త ప్లాన్‌..

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్‌ రేటు, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌ను అమర్చారు. ఔటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14తో వస్తోంది. నాలుగేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

ఈ ఫోన్‌లో వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో (OIS) వస్తోంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఇచ్చారు. 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ ఉంది. ముందు వైపు సెల్ఫీల కోసం 50 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బాక్సుతో పాటు ఛార్జర్‌ ఇవ్వడం లేదు. వేరుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వైఫై 6, యూఎస్‌బీ 2.0, బ్లూటూత్‌ 5.2, NFC, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్, ఐపీ 67 రేటింగ్ ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని