Snapchat: హోలీ వేళ స్నాప్‌చాట్‌ పిచికారీ లెన్స్‌.. ఎలా పనిచేస్తుందంటే?

Snapchat: సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు కొత్త లెన్స్‌లను తీసుకొచ్చే స్నాప్‌చాట్‌ తాజాగా హోలీ నేపథ్యంలో ఏఆర్‌ పిచికారీ అనే లెన్స్‌ను ప్రవేశపెట్టింది.

Published : 24 Mar 2024 17:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హోలీ సందర్భంగా స్నాప్‌చాట్‌ మరో కొత్త లెన్స్‌ను తీసుకొచ్చింది. ఏఆర్‌ పిచికారీ పేరిట తీసుకొచ్చిన దీనితో స్నేహితులకు వర్చువల్‌ రంగులను పూయొచ్చు. ఆగ్మెంటెడ్‌ రియాలిటీలో ఇప్పటికే పలు లెన్స్‌లను అందిస్తున్న ఈ వీడియో షేరింగ్‌ యాప్‌ తాజాగా దీన్ని తీసుకొచ్చింది.

ఏఆర్‌ పిచికారీ లెన్స్‌ను థర్డ్‌ పార్టీ డెవలపర్‌ రోనిన్‌ ల్యాబ్స్‌ రూపొందించింది. ఇతర ఏఆర్‌ లెన్స్‌ల తరహాలోనే స్నాప్‌చాట్‌ సెర్చ్‌ బార్‌లో వెతికి దీన్ని పొందొచ్చు. పిచికారీ లెన్స్‌ను సెలెక్ట్‌ చేసుకున్న తర్వాత వెనుక కెమెరాను స్నేహితుల వైపు ఉంచాలి. ఏఆర్‌ ద్వారా యాప్‌ మీ మిత్రులను గుర్తిస్తుంది. ‘హోలీ హాయ్‌’ అని కనిపించే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే వర్చువల్‌ రంగులను చల్లడం ప్రారంభిస్తుంది. రంగులు చల్లడానికి ఇక్కడ ఫోన్‌ను కదిలిస్తే సరిపోతుంది. ఇంకా ఎంత రంగు మిగిలి ఉందో పక్కన ఉండే బార్‌లో తెలుస్తుంది. సగం కలర్‌ పూర్తవగానే.. స్క్రీన్‌పై ‘హోలీ హాయ్‌’ అనే మెసేజ్‌ వస్తుంది. ఆ వెంటనే ఫొటోను స్నాప్‌ చేస్తే సరిపోతుంది. ఈ ప్రత్యేక లెన్స్‌ను ఇప్పటికే దాదాపు యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్నాప్‌చాట్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని