Sony Speakers: ఈ సోనీ స్పీకర్‌ రూ.90,000.. ఫీచర్లివే..

Sony Speakers: యూఎల్‌టీ పవర్‌ సౌండ్‌ (Sony ULT Power Sound) పేరిట భారత్‌లో సోనీ కొత్త స్పీకర్లు, హెడ్‌ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

Published : 28 May 2024 16:14 IST

 

Sony Speakers | ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో సోనీ కొత్త ఆడియో డివైజ్‌లను విడుదల చేసింది. యూఎల్‌టీ పవర్‌ సౌండ్‌ (Sony ULT Power Sound) పేరిట వైర్‌లెస్‌ స్పీకర్లు, నాయిస్‌ క్యాన్సిలింగ్‌ హెడ్‌ఫోన్లను తీసుకొచ్చింది. వీటిలో యూఎల్‌టీ టవర్‌ 10 పార్టీ స్పీకర్‌, యూఎల్‌టీ ఫీల్డ్‌ 7, యూఎల్‌టీ ఫీల్డ్‌ 1 పోర్టబుల్‌ వైర్‌లెస్‌ స్పీకర్లు, యూఎల్‌టీ వేర్‌ వైర్‌లెస్‌ నాయిస్‌ క్యాన్సిలింగ్‌ హెడ్‌ఫోన్లు ఉన్నాయి. మ్యూజిక్‌ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచేలా పలు సౌండ్‌ మోడ్‌లు, యూఎల్‌టీ బటన్‌ ఉండడం వీటి ప్రత్యేకత.

సోనీ యూఎల్‌టీ టవర్‌ 10

పెద్ద పెద్ద పార్టీల్లో వాడుకునేందుకు అనువుగా యూఎల్‌టీ టవర్‌ 10 (Sony ULT Tower 10) స్పీకర్లను డిజైన్‌ చేశారు. దీంట్లో యూఎల్‌టీ బటన్‌, వైర్‌లెస్‌ మైక్‌ ఉంటాయి. ప్యానెల్‌పై ఎకో సహా కీలక కంట్రోల్స్‌ను పొందుపర్చారు. బ్లూటూత్‌ 5.2 కనెక్టివిటీతో పాటు ఎస్‌బీసీ, ఏఏసీ, ఎల్‌డీఏసీ కోడెక్స్‌లను సపోర్ట్ చేస్తాయి. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్‌ 20 kHz నుంచి 20,000 kHz. ‘పార్టీ కనెక్ట్‌’ ఫీచర్‌ ద్వారా మ్యూజిక్‌, లైటింగ్‌కు అనుసంధానమయ్యేలా 100 స్పీకర్ల వరకు దీనికి కనెక్ట్‌ చేయొచ్చు. దీని ధర రూ.89,990.

సోనీ యూఎల్‌టీ ఫీల్డ్‌ 7

సోనీ యూఎల్‌టీ ఫీల్డ్‌ 7 (Sony ULT Field 7) డైనమిక్‌ లైటింగ్‌ పోర్ట్‌తో వస్తున్న పోర్టబుల్‌ పార్టీ స్పీకర్లు. ఇది ఐపీ67 రేటింగ్‌తో వస్తున్న డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్ స్పీకర్లు కావడం విశేషం. వెనక ప్యానల్‌లో ఎకో సహా కీలక కంట్రోల్స్‌ ఉన్నాయి. టవర్‌ 10 తరహాలోనే దీంట్లో కూడా ‘పార్టీ కనెక్ట్‌’ ఫీచర్‌ ఉంది. దీని ధర రూ.39,990.

లెదర్‌ ఫినిష్‌తో శాంసంగ్‌ ఎఫ్‌55.. లాంచ్‌ ఆఫర్లు ఇవే..

సోనీ యూఎల్‌టీ ఫీల్డ్‌ 1

12 గంటల బ్యాటరీ లైఫ్‌ ఇచ్చేలా యూఎల్‌టీ ఫీల్డ్‌ 1 (Sony ULT Field 1) స్పీకర్‌ను రూపొందించారు. బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీతో పాటు ఏఏసీ, ఎస్‌బీసీ కోడెక్స్‌ను సపోర్ట్‌ చేస్తుంది. నలుపు, ఆఫ్‌ వైట్‌, ఫ్రాస్ట్‌ గ్రే, ఆరేంజ్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.10,990.

సోనీ యూఎల్‌టీ వేర్‌ వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్లు

బేస్‌ను ఇష్టపడేవారి కోసం సోనీ యూఎల్‌టీ వేర్‌ వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్లను (Sony ULT Wear wireless noise cancelling headphones) డిజైన్‌ చేశారు. దీంట్లో పర్సనలైజ్డ్‌ ఈక్యూలు, 360 డిగ్రీల రియాలిటీ ఆడియో, యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ ఉన్నాయి. వేర్‌ డిటెక్షన్‌, మోల్డబుల్‌ క్యూషన్స్‌, మల్టీపాయింట్‌ కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.16,990.

ఎంపిక చేసిన క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి యూఎల్‌టీ టవర్ 10పై రూ.6,000, యూఎల్‌టీ ఫీల్డ్‌ 7పై రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంది. ఈకామర్స్‌ వెబ్‌సైట్లు సహా సోనీ రిటైల్ స్టోర్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు